కలెక్షన్ కింగ్ మంచు మోహన్‌బాబు నటించిన సన్నాఫ్ ఇండియా సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రచయిత అయిన డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో మంచు విష్ణు స్వయంగా నిర్మించిన ఈ సినిమాపై ముందు నుంచి అంచనాలు లేవు. దీనికి తోడు ఇటీవల మా ఎన్నికలు, ఏపీ రాజకీయాల నేపథ్యంలో మంచు ఫ్యామిలీ బాగా ట్రోలింగ్‌కు గురవుతోంది. దీంతో రిలీజ్‌కు ముందే ఏ మాత్రం అంచనాలు లేకుండా సినిమా రిలీజ్ అయ్యింది. చివరకు ఈ సినిమాను కొనేందుకు కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు.
రు 3.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను చివరకు మంచు విష్ణు స్వయంగా రు 1.2 కోట్ల రేషియోలో ఓన్‌గా రిలీజ్ చేసుకున్నారు. అంటే రిలీజ్‌కు ముందే నష్టాలతో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. సినిమా రిలీజ్‌కు బుక్ మై షోలో ఒక్కటంటే ఒక్క టిక్కెట్ కూడా అమ్మకం కాకుండా అతిపెద్ద చెత్త రికార్డు నమోదు చేసుకుంది. ఇక నిన్న సినిమా రిలీజ్ అయ్యాక జనాలు ఈ సినిమా చూసి తలలు పట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో మోహన్‌బాబును మాత్రమే కాదు.. మంచు ఫ్యామిలీ మొత్తాన్నే ఓ ఆటాడేసుకుంటున్నారు.
వీరిలో మనోజ్‌కు కాస్త మినహాయింపు ఉంది. ఈ సినిమా మోహన్‌బాబు ఏకపాత్రాభినయం ఆఫ్ ఇండియా అని.. మోహన్‌బాబు మీ సినిమాకు శత నిమిశోత్సవ ఫంక్షన్ ఎప్పుడు ? అని కామెంట్లు చేస్తున్నారు. సినిమా చివర్లో మిషన్ కంటిన్యూస్ అని వేస్తారు. దీనికి సీక్వెల్ కూడానా బాబు అని కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఫుల్ టిక్కెట్‌కు డబ్బులు వసూలు చేసి.. సగం చూపించిన సినిమాగా సన్ ఆఫ్ ఇండియా రికార్డులకు ఎక్కిందని కొందరు అంటున్నారు.
మరి కొందరు ఏ సినిమాపై మరో జోక్ వేస్తున్నారు. షార్ట్ ఫిల్మ్ లాంటి సినిమాను ఫుల్ టిక్కెట్‌పై చూపించడం పెద్ద మైనస్ అయితే… ఈ సినిమా చాలా త్వరగా ముగిసిపోవడం పెద్ద ప్లస్ అని కామెంట్ చేస్తున్నారు. ఓవరాల్‌గా 1.40 గంటల నిడివితో షార్ట్ ఫిల్మ్‌కు ఎక్కువ.. ఫీచర్ ఫిల్మ్‌కు తక్కువ అన్నట్టుగా ఈ సినిమా ఉందని అంటున్నారు. ఏదేమైనా మంచు ఫ్యామిలీ నెటిజన్లకు మామూలుగా దొరకలేదు. ఇక చాలా మంది ఈ సినిమాకు 1 రేటింగ్ .. మరి కొందరు 0.5 రేటింగ్ ఇస్తున్నారు.