పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమా కోసం అభిమానులు ఎంత గా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇందులో రానా దగ్గుబాటి విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా కి దర్శకుడిగా సాగర్ చంద్ర వర్క్ చేస్తుండగా..త్రివిక్రమ్ శ్రీనివాశ్ డైలాగ్స్ అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్,ట్రైలర్ లో వచ్చే డాలాగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో అనుకున్న దానిమీద ఎక్కువ హైప్ పెట్టుకుని ఉన్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. పైగా ఈ సినిమాలో పవన్ పోలీస్ ఆఫిసర్ రోల్ లో కనిపించనుండడం మరో ఆసక్తికర విషయం.
మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ మూవీలో పవన్ సరసన నిత్యా మీనన్ నటిస్తోంది. అయితే ఈ సినిమాను ముందుగా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. దీంతో భీమ్లా నాయక్ సినిమా కోసం పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ కొన్ని అనివార్య కారణాల చేత పోస్ట్ పోన్ అయ్యింది. కాగా ఊహించని విధంగా ఈ నెల 25 న సినిమాను రిలీజ్ చేస్తున్నామని చెప్పారు చిత్ర బృందం. దీంతో అభిమానుల ఊపుకు అడ్దు లేకుండా పోయింది. మరికొన్ని గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట వైరల్ గా మారింది.
భీమ్లా నాయక్ సినిమా ఇద్దరు జానపద కళాకారులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో మొగిలయ్య పాడిన టైటిల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే సాహితి చాగంటితో కలిసి కుమ్మరి దుర్గవ్వ పాడిన అడవితల్లి మాట ఎంతగా మార్మోగిపోయాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కూలీ పనులు చేసుకుంటూ ఫోక్ సాంగ్స్ పాడే దుర్గవ్వ అడవితల్లి సాంగ్లో అచ్చమైన, స్వచ్ఛమైన పల్లెగొంతును వినిపించింది. అయితే ఈ పాట పాడినందుకు చిత్ర మేకర్స్ ఆమెకు ఎంత ఇచ్చారో తెలుసా..? రూ.10 వేలు ఇచ్చారట. ఈ విషయాని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చింది. ఆమె ఆ పాటను 5 నిమిషాలల్లో పాడేశానని..అప్పుడు 10 వేలు ఇచ్చారని..ఆ తరువాత మిగత కొంత డబ్బును..తన కూతురికి ఇచ్చి పంపించారని తెలిపింది దుర్గవ్వ.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఓ డబ్బున్న మాజీ సైనికాధికారి అహానికి.. ఓ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ ఆత్మ గౌరవానికి మధ్య జరిగే పోరాటమే ‘అయ్యప్పునుమ్ కోశీయుమ్’ కథ. మలయాళంలో డబ్బున్న వ్యక్తిగా పృథ్విరాజ్.. పోలీస్ ఆఫీసర్గా బిజూ మీనన్ నటించారు. తెలుగులో ఆ పాత్రలను పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిలు నటించారు. మరి చూడాలి బాక్స్ ఆఫిస్ వద్ద ‘భీమ్లా నాయక్’ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో..?