అనసూయ భరద్వాజ్ .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ఇండస్ట్రీలో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ ఓ స్టార్ హీరోయిన్ కి కూడా లేదు అనే చెప్పాలి . జబర్దస్త్ అనే కామెడీ షో ద్వార పాపులర్ అయిన ఈ అమ్మడు.. ఇప్పుడు స్టార్ హీరో ల సినిమాలో కూడా నటిస్తూ మెప్పిస్తుంది. ఓ వైపు యాంకర్ గా చేస్తూనే మరో వైపు సినిమాలు చేస్తూ బిజీగా తన కెరీర్ ను ప్లాన్ చేసుకుంది. అనసూయ అంటే బుల్లితెరపై ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఆడియెన్స్ ను అలరిస్తున్న ఈ అమ్మడు ఏ షో చేసిన అది మంచి సక్సెస్ అందుకుంటుంది.
ఇక అమ్మడు డ్యాన్స్ చూస్తే ఎవ్వరైన ఫిదా అవ్వాల్సిందే. షోలో కామెడీతో పాటుగా అనసూయ అందాలు కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. పొట్టి పొట్టి..బిగుతైన డ్రెస్సులు..ఒంటికి అతుక్కుపోయే శారీస్..మత్తెక్కించే మాటలు…డ్యాన్సులు ఇలా అన్ని రకాలుగా కుర్రాళ్ళ హృదయాలు కొల్లగొట్టింది. అతి తక్కువ సమయంలోనే బుల్లితెరపైనే కాదు వెండి తెరపై కూడా తన దైన స్టైల్ లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. అందరితో ఫ్రెండ్లీ గా ఉండటం అనసూయకి అలవాటు. ఇండస్ట్రీలో అనసూయకి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే తనకు కోపం వస్తే మాత్రం అది ఎవ్వరైన సరే ఇచ్చిపడేస్తుంది.
సోషల్ మీడియాలో తన పై ట్రోలింగ్ చేసే వారికి కూడా అమ్మడు చాలా సార్లు తన మాటలతో గట్టిగానే సమాధానం ఇచ్చింది. అయితే ఈసారి మాత్రం ఓ జర్నలిస్ట్ తన పై రాసిన న్యూస్ కి స్పందిస్తూ ..కూల్ గా రిప్లై ఇస్తూనే..అనాల్సిన మాటలు అనేసింది. తాజాగా ఓ మీడియా సంస్థ, ఓ జర్నలిస్ట్ తన ఫోటోలను ప్రచురిస్తూ రాసిన వార్తపై అసహనం వ్యక్తం చేస్తూ..ఘాటుగా రిప్లై ఇచ్చింది అనసూయ. సదరు వ్యక్తి రాసిన ఆర్టికల్లో అనసూయ వయసు 40 అని రాసుకొచ్చింది..
దీంతో అనసూయా స్పందిస్తూ..”నా వయసు 36 నే. నా వయసు ను చెప్పుకొవడానికి నేను సిగ్గుపడను. నేను అందంగా కనిపించడానికి ట్రై చేస్తా..కానీ నా వయసు ఇది అని చెప్పుకొవడానికి మాత్రం అస్సలు సిగ్గుపడను. అది నిజం కాబట్టి. జర్నలిజం అనేది శక్తివంతమైన ఆయుధం. మీరు రాసే ప్రతి పదం రాసే ముందు ఆలోచించి రాయండి. లేకపోతే అది మీకే ప్రమాదంగా మారుతుంది” అని అనసూయ ఘాటుగా తనదైన స్టైల్ లో చెప్పుకొచ్చింది.
Hello Satvika(the journalist of this article)I am not 40+..I am 36..age ascending is inevitable & I never shy away to that fact..(but I promise to look good & age gracefully)But journalists like you should consider your profession with Honesty & Ethics..its high time..Goodluck 😊 https://t.co/tJFZ0G1gVk
— Anasuya Bharadwaj (@anusuyakhasba) February 18, 2022