ఇండస్ట్రీలో ఎవరికి అయినా హిట్టు.. ప్లాపు అనేది కామన్. హిట్టు వస్తే ఆ హిట్టును ఆ యూనిట్ అంతా ఓ వారం రోజులో పది రోజులో లేదా నెల రోజులో ఎంజాయ్ చేస్తారు. ఆ సినిమా రికార్డులు, వసూల్ల గురించి మాట్లాడుకుంటారు. అదే సినిమా ప్లాప్ అయితే దానికి చాలా లెక్కలు వేసుకుని ఆన్సర్లు ఇస్తుంటారు. ఆ ప్లాప్ బాధ మర్చిపోయి వెంటనే కొత్త సినిమాపై కాన్‌సంట్రేషన్ చేసేస్తుంటారు. అయితే సూపర్‌స్టార్ మహేష్‌బాబు మాత్రం అలా చెప్పడం లేదు. సినిమా ప్లాప్ అయితే తాను చాలా బాధపడతానని చెపుతున్నాడు. సినిమా ఆడకపోతే ఆ తప్పంతా తనదే అంటున్నాడు.
సినిమా ప్లాప్ అవ్వడం తనకు చాలా బాధ కలిగించే అంశం అని… ప్లాప్ అయితే అందరికంటే తానే ముందు బాధపడతాను అని… చాలా ఫీలవుతానని.. నా వల్లే డబ్బులు పోయాయి కదా ? కథ ఓకే చేసి ఉండకపోతే ఈ డబ్బంతా పోయి ఉండేదే కాదని తాను ఫీలవుతానని.. సినిమా ప్లాప్ అయితే దానికి మొట్టమొదటి బాధ్యుడిని తానే అని మహేష్ చెప్పాడు. ఇక సినిమా ప్లాప్ అయితే తాను 2-3 రోజులు రూమ్ నుంచి బయటకు రానని .. ఆ ప్లాప్ నుంచి ఎలా ? బయట పడాలా ? అని ఆలోచిస్తూ రూమ్‌లోనే గడిపేస్తానని చెప్పారు.
ఫెయిల్యూర్స్ నుంచే తాను సక్సెస్ అయ్యానని చెప్పిన మహేష్.. కథల ఎంపిక బాధ్యత పూర్తిగా తనదే అని.. ఇందులో తన తండ్రి ప్రమేయం కూడా ఉండదని చెప్పాడు. కథల ఎంపిక విషయంలో తాను ఎప్పుడూ ఇతరుల మీద ఆధారపడలేదని… కెరీర్ స్టార్టింగ్ నుంచి ప్రతి నిర్ణయం తానే తీసుకుంటానని చెప్పాడు. భవిష్యత్తులో నా అబ్బాయి కూడా అలాగే ఉండాలని.. తాను వాడిని సపోర్ట్ చేయనని చెప్పాడు.
కెరీర్‌లో ఫెయిల్యూర్స్ గురించి ఆలోచించే వాడే సక్సెస్ అవుతాడని… తన కెరీర్‌లో అదే జరిగిందని మహేష్ చెప్పాడు. ఇక ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తోన్న మహేష్.. ఆ వెంటనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. సర్కారు వారి పాట మే 12న రిలీజ్ అవుతోంది. అనంతరం ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది.