సాధారణంగా ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లి కేవలం రెండున్నర గంటల పాటు సినిమా చూసి ఎంటర్టైన్మెంట్ పొందుతూ ఉంటారు. కానీ ఆ రెండున్నర సినిమా వెనక ఎన్నో రోజుల కష్టం ఉంటుంది.. ఆ కష్టం కేవలం సినిమా వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సినిమా ప్రేక్షకులకు నచ్చే విధంగా.. నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టే విధంగా.. నటీనటులు అందరికీ మంచి పేరు వచ్చే విధంగా.. ఇలా అన్ని వైపుల నుంచి ఆలోచిస్తూ ఆచితూచి అడుగులు వేస్తూ ఎన్నోకష్టాలను ఎదుర్కొంటూ సినిమా తెరకెక్కిస్తు ఉంటారూ. ఇంత కష్టపడి సినిమా చేసిన తర్వాత పైరసీగాళ్ళు మాత్రం రెచ్చిపోతూ నిర్మాతలకు షాక్ ఇస్తూ ఉంటారు.
సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను లీక్ చేయడం కీలకమైన క్లైమాక్స్ సీన్ సోషల్ మీడియా లు పెట్టడం చేసి సినిమాకు నష్టాన్ని చేకూరుస్తు ఉంటారు. పైరసీ కారణంగా ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం పైరసీ గురైన సత్తా చాటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం దర్శకత్వంలో రష్మిక మందన హీరోయిన్ గా నటించిన చిత్రం గీత గోవిందం. భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలైంది.. అయితే ఈ సినిమా విడుదలైన రోజే క్లైమాక్స్ మొత్తం ఆన్లైన్ లో దర్శనమిచ్చింది.
చివరికి పోలీస్ కంప్లైంట్ వరకు వెళ్ళింది ఈ వ్యవహారం. అయితే సినిమా క్లైమాక్స్ లీకైనా సినిమా మాత్రం సూపర్ హిట్ అయింది. అంచనాలకు మించిన విజయాన్ని సాధించి అదరగొట్టింది. దర్శక ధీరుడు రాజమౌళి భారీ బడ్జెట్తో తెరకెక్కించిన బాహుబలి సినిమా విషయంలో కూడా పైరసీ కొన్ని ఇబ్బందులు సృష్టించింది. కొంతమంది పైరసీగాళ్ళు కీలకమైన సన్నివేశాలను లీక్ చేశారు. అయినప్పటికీ బాహుబలి సినిమాస్ మాత్రం సూపర్ హిట్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా రికార్డులు కొల్లగొట్టింది. ఇక రజనీకాంత్ హీరోగా నటించిన రోబో 2.0 టీజర్ సమయంలో పైరసీ గాళ్ళు రెచ్చిపోయారు.
ఇక చిత్ర బృందం అధికారికంగా టీజర్ విడుదల చేయడానికి ముందే రోబో 2.0 టీజర్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇక మరోవైపు రంగస్థలం సినిమా పోస్టర్స్ కూడా చిత్రబృందం విడుదల చేయకముందే సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఇక ఇలా పైరసీ ద్వారా కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ సినిమా సక్సెస్ మాత్రం ఇవి ఆపలేకపోయాయి. ఇలా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు లీక్ అయిన ప్పటికీ హిట్టు కొట్టి సత్తా చాటాయి అనే చెప్పాలి. దీంతో లీక్ అయితే సినిమా హిట్ కొట్టడం పక్క అని ఎంతో మంది దర్శక నిర్మాతలు కూడా ఇప్పుడు నమ్ముతున్నారట.