Moviesఏవయ్యా డైరెక్టరు..కొంచమైనా చూసుకోవాలిగా..ఆమాత్రం తెలి"వి/య"లేదా..?

ఏవయ్యా డైరెక్టరు..కొంచమైనా చూసుకోవాలిగా..ఆమాత్రం తెలి”వి/య”లేదా..?

అయ్య బాబోయ్ ఈ మధ్య కాలంలో హీరోయిన్లు డబ్బు ఇస్తే ఏ పనికి అయినా సిద్ధం అనేటట్లు ఉన్నారు అంటున్నారు నెటిజన్స్. ఇక వాళ్ళు చేసే పనులు కూడా అలాగే ఉన్నాయి లేండి. సినిమా అంటేనే ఎంటర్ టైన్ మెంట్ కోసం..కానీ ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాల్లో అది తప్ప అన్ని చూపిస్తున్నారు. అన్నీ సినిమాల్లో వల్గర్ సీన్స్ ఉన్నాయి అని చెప్పలేం కానీ, చాలా సినిమాల్లో మాత్రం చూడకూడనివి కూడా చూయిస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్ ఎక్స్ పోజింగ్స్.. అసలు బట్టలు వేసుకున్నారా వేసుకోలేదా అన్నట్లు వేసుకుని ..కుర్రాళ్ళను టెంప్ట్ చేస్తున్నారు. ఇదే విషయాలని ఎవ్వరైన ధైర్యం చేసి అడిగితే డైరెక్టరు చెప్పారు..మేము చేసాము అంటూ చెప్పుకొస్తున్నారు.

ఇక అలా ఓ డైరెక్టర్ ఇప్పుడు నెట్టింట నవ్వుల పాలవుతున్నాడు. ఆయన మరెవరో కాదు.. త్రినాధరావు నక్కిన. ప్రస్తుతం ఈయన మాస్ మహా రాజ రవితేజ ను డైరెక్ట్ చేసే పనిలో పడ్డాడు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రవి తేజ ఓ సినిమాను కమిట్ అయిన విషయం తెలిసిందే. ఆ సినిమా పేరే ధ‌మాకా . ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై టి.జి విశ్వ‌నాథ్, అభిషేక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరొలియో ఈ మూవీకి సంగీతం స‌మ‌కూర్చుతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కుర్ర హీరోయిన్ పెళ్లి సంద‌డ్ బ్యూటీ శ్రీ‌లీల న‌టిస్తోంది.

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా శ్రీలీలని పావని పాత్రలో పరిచయం చేస్తూ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో శ్రీలీలతో రవితేజ ఆమెకు ఏదో చెబుతుండగా, శ్రీలీల దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టు కన్పిస్తోంది. అయితే ఈ పోస్టర్ ను చూసి రవితేజ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతుండగా మరి కొంతమంది నెటిజన్స్..నెగిటీవ్ కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్ గా శ్రీలీల ను పెట్టుకోవడం పట్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఏవయ్యా డైరెక్టరు..జోడీ సెట్ చేసే ముందు కొంచెం అయినా ఆలోచించవా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు వీళ్లను చూస్తుంటే..హీరో హీరోయిన్ల లా గా కాదు..అన్న చెల్లిలికి ఏదో జాగ్రత్తలు చెబుతున్నట్లు ఉంది..అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అయితే ఆ మాత్రం తెలివి లెదా..లేక ..చూస్తుంటే నీకు తెలియలేదా అంటూ నెట్టింట ఆయనను ట్రోల్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news