టాలీవుడ్ లో నాచురల్ స్టార్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నాని వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. వి – టక్ జగదీష్ సినిమాలను కరోనా టైంలో ఓటీటీలో రిలీజ్ చేసి రిస్క్ చేసిన నాని గతేడాది చివర్లో శ్యామ్‌సింగరాయ్ సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు. ఆ సినిమాకు ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు కూడా వచ్చాయి. టాలీవుడ్లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి వరుస హిట్లతో ఈ స్థాయికి వచ్చాడు నాని.
తన సహజసిద్ధమైన నటనతో నాని యూత్వింగ్లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. నాని చేతిలో ప్రస్తుతం నాలుగైదు సినిమాలు వరుసగా లైన్లో ఉన్నాయి. నాని స్వస్థలం ఏపీలోని కృష్ణా జిల్లా చల్లపల్లి ప్రాంతం. అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలన్న కోరికతో ఇండస్ట్రీలోకి వచ్చిన నాని అష్టాచెమ్మా సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత రైడ్ సినిమా తర్వాత మరింత పాపులర్ అయ్యాడు.
ఇక నాని 2017లో అంజన అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లికి ముందు వీరు ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. అనంతరం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు అర్జున్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. ఇక నాని భార్య అంజన బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. వాళ్ల ఫ్యామిలీకి చాలా మంచి చరిత్రే ఉంది. అంజన తాతగారు ఎవరో కాదు ఎరగత్తి నాయుడమ్మ.. ఆయన ప్రసిద్ధ శాస్త్రవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆయన విమాన ప్రమాదంలో మరణించారు. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని ఎరువల అంజన స్వగ్రామం. అంజన తాత నాయుడమ్మ శాస్త్ర సాంకేతిక రంగంలో ఆయన చేసిన సేవలకు గాను పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నారు. నాయుడమ్మకు ముగ్గురు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు కుమార్తే సంజన. ఇక నాయుడమ్మ ప్రజల శాస్త్రవేత్తగా కీర్తి గడించారు. ఆయన 1985లో కనిష్క విమాన ప్రమాదంలో మృతి చెందారు.
ఆ ప్రమాదం జరిగినప్పుడు మొత్తం 329 మంది చనిపోతే అందులో 120 మృతదేహాలు మాత్రమే దొరికాయి. అంజన నాయనమ్మ పవనాబాయి. ఆమె మద్రాస్‌లో ఫేమస్ గైనకాలజిస్ట్. తన భర్త విమాన ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఆమె కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఇక అంజన తండ్రి లెదర్ ఫ్యాక్టరీ పెట్టి వ్యాపారంలో సక్సెస్ అయ్యారు. అంజనకు సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా కూడా ఆమె మాత్రం కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్ చేసింది.