సినిమా రంగంలో ఎంత పెద్ద హీరో అయినా కూడా ఒక్కోసారి ఎత్తుపల్లాలు ఎదుర్కొంటూ ఉంటాడు. ఒక్కోసారి వరుస ప్లాపులతో కెరీర్ పరంగా పాతాళానికి వెళ్లిపోతారు.. ఆ వెంటనే ఒక్క హిట్ సినిమా పడితే చాలు వెంటనే తన స్టామినా ఏంటో ఫ్రూవ్ చేసుకుని ఫామ్‌లోకి వచ్చేస్తాడు. కొందరు హీరోలు తమకు నోటిదాకా, చేతిదాకా అందివచ్చిన హిట్ సినిమాలను వదులుకుని.. తర్వాత బాధపడుతుంటారు. టాలీవుడ్ యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సైతం ఒకటికాదు రెండు కాదు ఏకంగా 10 బ్లాక్‌బస్టర్ సినిమాలను వదులుకున్నాడు. ఎన్టీఆర్ అవి కూడా చేసి ఉంటే మనోడి కెరీర్ మరో రేంజ్‌లో ఉండేది.
టెంపర్‌కు ముందు వరకు వరుస ప్లాపులతో ఉన్న ఎన్టీఆర్ కెరీర్‌కు టెంపర్ మంచి ఊపుఇచ్చింది. ఆ తర్వాత వరసగా ఐదు సూపర్ హిట్లు పడ్డాయి. ఇప్పుడు త్రిబుల్ ఆర్ కూడా హిట్ అయితే టాలీవుడ్‌లో ఏ హీరోకు లేనట్టుగా డబుల్ హ్యాట్రిక్ కొట్టిన హీరోగా ఎన్టీఆర్ నిలిచిపోతాడు. ఇక ఎన్టీఆర్ మిస్ చేసుకున్న ఆ సూపర్ హిట్ సినిమాలేంటో ఓ సారి చూద్దాం.
1- దిల్ :
2003లో వినాయక్ – నితిన్ కాంబినేషన్లో వచ్చిన దిల్ సినిమా కథ ముందుగా ఎన్టీఆర్ దగ్గరకే వెళ్లింది. అయితే అప్పటికే ఎన్టీఆర్ స్టూడెంట్స్ రోల్ చేసి ఉండడంతో ఆ పాత్ర మరోసారి చేయడం ఇష్టంలేక రిజెక్ట్ చేశాడు. అయితే దిల్ రాజు తొలి సినిమాగా వచ్చిన ఈ సినిమా నితిన్ కెరీర్‌ను మార్చేసింది.
2- ఆర్య:
అల్లు అర్జున్‌కు కెరీర్ స్టార్టింగ్‌లోనే యూత్‌లో తిరుగులేని క్రేజ్ తెచ్చిన సినిమా ఇది. సుకుమార్ ముందుగా ఈ కథను ఎన్టీఆర్‌తోనే చేయాలని అనుకున్నాడు. అయితే ఎన్టీఆర్ రాంగ్ జడ్జ్‌మెంట్‌తో అనవసరంగా ఈ సినిమా వదులుకున్నాడు.
3- భద్ర:
తొలుత బోయపాటి శ్రీను ఈ కథను బన్నీకి చెపితే బన్నీ రిజెక్ట్ చేశాడు. తర్వాత ఎన్టీఆర్‌కు చెప్పాడు.. ఎన్టీఆర్‌కు ఎక్కలేదు. చివరకు దిల్ రాజు బ్యానర్లో రవితేజ హీరోగా వచ్చిన ఈ సినిమా రవితేజ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అయ్యింది.
4- అతనొక్కడే:
దర్శకుడు సురేందర్‌రెడ్డికి ఇది తొలి సినిమా. కథ కూడా ఎన్టీఆర్‌కు నచ్చింది. అయితే ఎన్టీఆర్ మాత్రం కళ్యాణ్‌రామ్‌తోనే చేయాలని చెప్పడంతో చివరకు కళ్యాణ్‌హీరోగా తెరకెక్కి హిట్ కొట్టింది. కానీ ఇదే కథతో ఎన్టీఆర్ సినిమా చేసి ఉంటే.. ఆ సినిమా రేంజ్ వేరుగా ఉండేది.
5- కిక్:
అశోక్ – అతిథి లాంటి ప్లాపులతో ఉన్న దర్శకుడు సురేందర్‌రెడ్డి మీద నమ్మకం లేక ఎన్టీఆర్ కిక్‌ను వదులుకున్నాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. విచిత్రం ఏంటంటే ఈ సినిమాకు ముందు అశోక్‌తో సురేందర్‌రెడ్డికి ఛాన్స్ ఇచ్చిన ఎన్టీఆర్ ఆ తర్వాత ఊసరవెల్లితో మరో ఛాన్స్ ఇచ్చాడు. కిక్ హిట్ అయితే ఎన్టీఆర్ ఛాన్స్ ఇచ్చిన రెండు సినిమాలు అంచనాలు అందుకోలేదు.
6- కృష్ణ:
2018 సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా ఆ యేడాది హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ముందు ఈ కథ ఎన్టీఆర్ దగ్గరకే వెళ్లింది. అయితే ఎన్టీఆర్ సంతృప్తి చెందకపోవడంతో చివరకు వినాయక్ రవితేజ హీరోగా తీసి హిట్ కొట్టాడు. కృష్ణ సినిమా టైంలో ఎన్టీఆర్‌కు సరైన హిట్ లేదు. ఈ సినిమా చేసి ఉంటే ఖచ్చితంగా అప్పట్లో ఎన్టీఆర్ మార్కెట్ కనీసం ఎవ్వరి దరిదాపుల్లో కూడా ఉండేదే కాదు.
7- శ్రీమంతుడు:
అంతకుముందే బృందావనం సినిమాకు కథ అందించడంతో కొరటాల శివ – ఎన్టీఆర్‌కు మధ్య మంచి రిలేషన్ ఉంది. అందుకే కొరటాల శివ ఈ కథ ముందుగా ఎన్టీఆర్‌కే చెప్పాడు. కథ కూడా బాగా నచ్చింది. అయితే ఇతర కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉన్న కారణంగా ఈ సినిమా వదులుకున్నాడు. ఇది నిజంగా ఎన్టీఆర్ దురదృష్టమే..!
8- ఊపిరి:
నాగ్ – ఎన్టీఆర్ కాంబినేషన్లో ఈ ప్రాజెక్ట్ తొలుత ప్రకటించారు. కానీ.. స్క్రిప్టులో మార్పులు సూచించడం, అది వర్కౌట్ అవ్వదని తేలడంతో ఎన్టీఆర్ తప్పుకున్నాడు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టులోకి కోలీవుడ్ హీరో కార్తీ ఎంటర్ అయ్యాడు.
9- రాజా ది గ్రేట్:
పటాస్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి ఒక్కసారిగా అందరి దృష్టి తన వైపునకు తిప్పుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ క్రమంలోనే ఈ సినిమా కథను ముందుగా ఎన్టీఆర్‌కు చెప్పగా ఈ కథకు తాను సూట్ కానని చెప్పడంతో ఈ కథ చివరకు రవితేజ దగ్గరకు వెళ్లింది.
10- పటాస్:
అనిల్ రావిపూడి పటాస్ కథను కళ్యాణ్‌రామ్‌కు చెప్పాడు. కళ్యాణ్‌రామ్ ఇంత మంచి కథ తనతో ఎందుకు పెద్ద హీరోతో చేయి.. నేను నిర్మాతగా ఉంటానని చెప్పాడు. ఎన్టీఆర్‌కు కథ చెపుదాం.. ఎన్టీఆర్‌తో చేద్దాం అని చెప్పాడు. ఎన్టీఆర్ మాత్రం కళ్యాణ్‌రామ్ కెరీర్ డౌన్‌లో ఉండడంతో ఆ కథ ఆయనకే వదిలేశాడు.
ఇవన్నీ కూడా ఎన్టీఆర్ వదులుకున్న 10 సూపర్ హిట్ ప్రాజెక్టులు. ఒక వేళ ఈ సినిమాలు కూడా ఎన్టీఆర్ చేసి ఉంటే ఎన్టీఆర్ కెరీర్ ఏ రేంజ్‌లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఇక త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ లైనప్‌లో వరుసగా క్రేజీ ప్రాజెక్టులే ఉన్నాయి. కొరటాల శివ – బుచ్చిబాబు సానా – ప్రశాంత్ నీల్ – త్రివిక్రమ్ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి.