హేమ దశాబ్దంన్నర కాలంగా తెలుగుతో పాటు సౌత్ ఇండియాలో పలు భాషల్లో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో పాత్రల్లో నటించి మెప్పిస్తున్నారు. అప్పట్లో బ్రహ్మానందం – హేమ కాంబినేషన్ అంటే నవ్వులు పండించేవారు. ఈ జంటకు ఎంతో క్రేజ్ ఉండేది. ఆ తర్వాత ఓ కమెడియన్ తనకు జోడీగా సినిమాలో హేమ వద్దని చెప్పారని.. ఆ సినిమా డైరెక్టర్ తనకు అదే విషయం చెప్పారని హేమ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఆ తర్వాత ఇదే విషయాన్ని తాను ఆ కమెడియన్ దగ్గర ప్రస్తావిస్తే తాను అలా అనలేదని చెప్పారని హేమ వెల్లడించారు. హేమ ఆ కమెడియన్ ఎవరు అన్నది చెప్పకపోయినా బ్రహ్మానందం గురించి ఆమె అలా చెప్పిందన్న ప్రచారం అయితే ఇప్పట్లో ఇండస్ట్రీలో వినిపించింది. ఇక తాను నమ్మిన ఓ ఫ్రెండ్ తన గురించి ఎక్కడపడితే అక్కడ నెగిటివ్ కామెంట్లు చేసేదని కూడా హేమ వాపోయింది. ఇలాంటి కామెంట్ల వల్ల ఒక్కోసారి నష్టం కూడా జరుగుతుందని హేమ చెప్పింది.
అయితే ఆమె ఎవరిని అయితే నమ్మిందో వాళ్లే ఆ తర్వాత ఆమెను వెన్నుపోటు పొడిచారని హేమ చెప్పింది. ఆ తర్వాత ఆమె తిరిగి తన దగ్గరకే వచ్చి తనదే తప్పు అని చెప్పుకుందని కూడా హేమ చెప్పింది. ఇక బాలయ్య గురించి ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలయ్యతో తాను చాలా సినిమాలు చేశానని.. బాలయ్య బాబు భోళాశంకరుడు అని.. ఆయన అంటే చాలా ఇష్టమని చెప్పింది.
ఆయన భగవద్గీత చదవడంతో దైవభక్తి మెండుగా ఉందని… మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో తాను ఓటు కోసం బాలయ్యకు ఫోన్ చేశానని.. ఆయనకు అస్సలు కల్లాకపటం ఉండదని చెప్పారు. ఇక ఆ ఎన్నికల్లో బాలయ్య బాబు తన ఓటు హేమకు, శ్రీకాంత్‌కు వేస్తానని చెప్పారని బాలయ్యను మెచ్చుకున్నారు.