రిలీజ్‌కు ముందు ఎలాంటి అంచనాలు క్రియేట్ చేశాడో రిలీజ్ అయ్యాక కూడా అంతే అంచనాలు క్రియేట్ చేశాడు డిజే టిల్లూ. యూత్‌లో తనకంటూ సపరేజ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్లు, ట్రైలర్లు, పోస్టర్లతో ఏదో కొత్తగా ఉంటుందన్న అంచనాలు యూత్‌లో కలిగించాడు. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా తొలి రోజే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఏపీ , నైజాంలో కలిపి తొలి రోజు ఈ సినిమాకు రు. 3 కోట్లకు పైగా షేర్ వచ్చింది.
మరో ట్విస్ట్ ఏంటంటే నైజాంలో తొలి రోజే టిల్లూ బ్రేక్ ఈవెన్ సాధించేశాడు. ఇది మామూలు రికార్డు కాదు. తొలి రోజు నైజాంలో ఈ సినిమాకు 1.63 కోట్ల షేర్ వచ్చింది. ఈ రోజు నుంచే నైజాంలో టిల్లు లాభాల్లోకి వచ్చేశాడు. రెండో రోజు బుకింగ్స్‌ను బట్టి చూస్తే ఫస్ట్ డే షేర్‌ను మించి ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఏపీలో కూడా ఈ సినిమాకు తొలి రోజు 1.50 కోట్ల షేర్ వచ్చింది.
ఇక ఓవర్సీస్లో కూడా ఈ సినిమా దూసుకుపోతోంది. తొలి రోజే యూఎస్‌లో బ్రేక్ ఈవెన్‌కు వచ్చేసింది. ప్రీమియర్స్‌తో కలుపుకునే తొలి రోజు ఏకంగా 2 లక్షల డాలర్లు వచ్చాయి. ఈ రోజు నుంచి చాలా రాష్ట్రాల్లో అక్కడ స్క్రీన్లు పెంచుతున్నారు. లాంగ్ రన్లో ఈ సినిమా భారీ వసూళ్లు సాధించడం అయితే ఖాయంగా కనిపిస్తోంది. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించాడు.