కోలీవుడ్ తల అజిత్ కుమార్ కొత్త సినిమా వలిమై రేపు ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా గురించి తెలుసుకుంటే చాలా నమ్మలేని నిజాలు కనిపిస్తాయి. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటేనే మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది. 3.03 నిమిషాల ఉన్న ట్రైలర్ అంతా కళ్లు చెదిరిపోయే యాక్షన్ సినిమాను తలపిస్తోంది. ఆ యాక్షన్ కూడా ఇప్పటివరకు ఇండియన్ సినిమా స్క్రీన్‌పై చూడని విధంగా కొత్తగా ఉంది. ఈ సినిమాను జీ స్టూడియోస్ – బోనీ కపూర్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మించారు.
వలిమై లో యాక్షన్స్ కోసం 4 కొత్త కార్డు, 150 మోటార్ బైక్‌లు వాడి మొత్తం 80 రోజుల పాటు యాక్షన్ సీన్లు షూట్ చేశారు. ఈ సినిమా ఫైట్స్ కోసం విదేశీ బైక్‌లు, కార్లతో పాటు విదేశీ టెక్నీషియన్లనే వాడారు. సినిమాలో ఎంత భారీ తనం కనిపించబోతోందో ట్రైలర్ చెప్పకనే చెప్పేసింది. ప్రతి ఫ్రేమ్‌లో గ్రాండియర్ లుక్ వచ్చేలా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు దర్శకుడు సీహెచ్. వినోద్. బైక్‌లపై ఫైటర్లు చేసిన యాక్షన్ సన్నివేశాలు తెరమీద చూస్తుంటే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది.
నిర్మాత బోనీకపూర్ కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా కోసం మొత్తం 150 మోటార్ బైక్‌లను ఉపయోగించామని.. 15 – 20 కార్లను వాడగా.. అందులో 4 పూర్తిగా కొత్తవి అని చెప్పారు. ఈ కొత్త కార్లలో కొన్నింటిని షూటింగ్‌లో పేల్చివేయడం కూడా జరిగిందట. దీనిని బట్టే ఈ సినిమా కోసం ఎంత భారీ బడ్జెట్ కేటాయించారో తెలుస్తోంది. ఇక రష్యాలోనే 25 – 30 బైక్‌లు ఫైట్ల కోసం కొన్నారు. షూటింగ్ పూర్తయ్యాక వాటిని డిస్కౌంట్‌కు అక్కడే అమ్మేశారట.
ఇండియన్ పోలీస్ హిస్టరీలోనే పోలీసులకు ఎప్పుడూ ఎదురుకానంత సవాల్ ఎలా ఎదురైంది ? దానిని వారు ఎలా ? చేధించారు ? అన్న కాన్సెఫ్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ముందుగా సంక్రాంతి కానుకగా వలిమై సినిమాను తెలుగు, తమిళ భాషల్లో జనవరి 13న రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే ఒమిక్రాన్ దెబ్బతో పెద్ద సినిమాలు వాయిదా వేయడంతో అది ఫిబ్రవరి 24కు వాయిదా పడింది. బాలీవుడ్ భామ హ్యూమా ఖ్యురేషీ అజిత్‌కు జోడీగా నటించగా.. తెలుగు హీరో కార్తీకేయ గుమ్మంకొండ విలన్‌గా నటించాడు. అందుకే ఈ సినిమా తెలుగులో కూడా భారీ అంచనాలతోనే రిలీజ్ అవుతోంది.
ఇక తమిళ టైటిల్ వలిమై అంటే ఆంగ్లంలో పవర్ అని అర్థం. భారీ పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతోంది. కేవలం తమిళంతో పాటు అన్ని భాషల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండడం విశేషం.