టాలీవుడ్‌లో 1980వ దశకం అంతా యాక్షన్ సినిమాల హంగామాతోనే నడిచేది. ఎంత పెద్ద హీరో అయినా.. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ఎక్కువుగా యాక్షన్ సినిమాలు చేసేందుకే ప్రయార్టీ ఇచ్చేవారు. ఆ టైంలో ఇద్దరు హీరోలు మాత్రమే కామెడీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను నవ్వించేవారు. వారిలో ఒకరు నటకిరీటా రాజేంద్రప్రసాద్ అయితే రెండో హీరో సీనియర్ నటుడు నరేష్. కృష్ణ – విజయనిర్మల వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన నరేష్‌కు ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉండడంతో త్వరగానే అవకాశాలు రావడంతో పాటు సెటిల్ అయ్యాడు.
నరేష్‌కు తనదైన కామెడీ మార్క్, టైమింగ్ బాగా ప్లస్ అయ్యేవి. 1970లోనే బాలనటుడిగా నటించిన నరేష్ 1982లో తన తల్లి విజయనిర్మల దర్శకత్వంలో వచ్చిన ప్రేమసంకెళ్లు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత రామచంద్రరావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం భళారే విచిత్రంతో పాటు 1993లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన జంబలడికిపంబ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.
ఇక నరేష్ వ్యక్తిగతం విషయానికి వస్తే కెమేరామెన్ శ్రీనివాస్ కుమార్తెను ముందు వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు నవీన్ అనే కుమారుడు జన్మించాడు. నవీన్ హీరోగా ఎంట్రీ ఇచ్చినా సక్సెస్ కాలేదు. ఇక నరేష్‌కు మొదటి భార్యతో మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత ఏపీకి చెందిన మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తెను నరేష్ రెండో వివాహం చేసుకున్నారు.
రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె అయిన రమ్యను 50 + ఏళ్ల వయస్సులో నరేష్ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి అప్పుడు మంత్రిగా ఉన్న రఘువీరా కూడా హాజరయ్యారు. అయితే ఈ పెళ్లి కూడా విడాకులతో పెటాకులు అయ్యింది. ఇక ఇప్పుడు నరేష్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన పవిత్రా లోకేష్‌తో ఎక్కువుగా కనిపిస్తున్నారన్న ప్రచారం అయితే ఉంది. ఇక నరేష్‌కు స్వతహాగా కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి.
విజయనిర్మల దర్శకురాలు, నిర్మాత, హీరోయిన్ కావడంతో ఆమె అప్పట్లో కూడబెట్టిన ఆస్తుల విలువే.. ఈ రోజు కోట్లలో ఉంటుంది. ఇక నరేష్ కూడా హీరో కావడంతో పాటు పలు వ్యాపారాలు చేయడం ద్వారా కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టుకున్నాడు.