Moviesపూరి జ‌గ‌న్నాథ్ భార్య‌కు మెగాస్టార్ చిరంజీవి బావ అవుతార‌ని మీకు తెలుసా...!

పూరి జ‌గ‌న్నాథ్ భార్య‌కు మెగాస్టార్ చిరంజీవి బావ అవుతార‌ని మీకు తెలుసా…!

టాలీవుడ్ డేరింగ్‌ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పర్చుకున్నారు. ఇప్పటి తరం జనరేషన్ హీరోలతో పాటు సీనియర్ హీరోలు అందరితోనూ ఆయన సినిమాలు చేశారు. పవన్ కళ్యాణ్ – ఎన్టీఆర్ – మహేష్ బాబు – అల్లు అర్జున్ – రామ్ చరణ్ – వ‌రుణ్‌తేజ్ – రామ్ ఇలా యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలు అయిన నాగార్జున – బాలకృష్ణ తో కూడా ఆయన సినిమాలు చేశారు. అటు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో కూడా హిట్ సినిమా తీశారు. అటు క‌న్న‌డ‌లోనూ ఆయ‌న సినిమాలు చేశారు.

ఎంత పెద్ద హీరో అయినా కేవలం రెండు నెలల్లోనే సూపర్ హిట్ సినిమాలు తీసిన ఘనత పూరీకే దక్కుతుంది. ఇక పూరి ఫ్యామిలీ విషయానికి వస్తే ఆయన భార్య లావణ్య. పూరి దంపతులకు హీరో ఆకాష్ తో పాటు కుమార్తె కూడా ఉన్నారు. పూరి – లావణ్య దంపతుల‌ది ప్రేమ వివాహం. పూరి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడే ఓ సినిమా షూటింగ్ చూడటానికి వచ్చిన లావణ్యను తొలిచూపులోనే ప్రేమించే చేశాడు అప్పుడు యాంకర్ ఝాన్సీ హేమ లాంటి వాళ్ళ సహకారంతో పూరి లావణ్య పెళ్లి చేసుకున్నాడు.

తన భర్త ఎంత పెద్ద డైరెక్టర్ అయినా కూడా లావణ్య ఎప్పుడు హౌస్ వైఫ్ గానే ఉంటూ భర్తకు చేదోడువాదోడుగా ఉంటున్నారు. లావణ్య కూడా పూరి కష్టసుఖాల్లో ఎప్పుడు పాలుపంచుకున్నారు. తాజాగా ఓ ప్రముఖ ఛానెల్ ఇంటర్వ్యూలో టాలీవుడ్ హీరోలతో పాటు వాళ్ల ఫ్యామిలీల‌తో తనకు ఉన్న అనుబంధాన్ని ఆమె ఎంతో గొప్పగా చెప్పారు. మాస్ మహారాజా రవితేజ తన ఇంటికి వస్తే కింద పడుకుంటాడు అని… కింద కూర్చుని ఉంటాడు అని… తమ‌ ఫ్యామిలీకి ఎంతో ఆప్తుడు అని చెప్పారు.

ఇక బన్నీ తనను అక్క అక్క అని పిలుస్తూ ఉంటాడ‌ని… తాను ఎప్పుడు ఫోన్ చేసినా ఎంత బిజీగా ఉన్నా కూడా మాట్లాడతాడ‌ని లావణ్య చెప్పారు. ఇక తాము మహేష్ బాబు ఇంటికి గెట్ టుగెదర్ కు వెళుతూ ఉంటామని… మోహన్ బాబు గారి భార్య నిర్మలమ్మ అంటే తనకు ఎంతో ఇష్టం అని… ఆమె తనతో ఎంతో ఆప్యాయతతో ఉంటారని లావణ్య తెలిపారు. నిర్మ‌ల‌మ్మ త‌న‌కు ఇన్సిప్రేష‌న్ అన్నారు.

ఇక బ‌న్నీ తల్లి నిర్మలమ్మ గారిని తాను అమ్మ అని పిలుచుకుంటా అని.. ఇక చిరంజీవి భార్య సురేఖ తనకు అక్క అవుతారని చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి తన ఫేవరెట్ హీరో అని ఆయన ఎక్క‌డ క‌న‌ప‌డినా తాను బావ అని పిలుచుకుంటా అని లావణ్య తన అభిమానం చాటుకున్నారు. చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కించాల‌ని పూరి జగన్నాథ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ఆటో జానీ సినిమా చేయాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల అది సెట్ కాలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news