Moviesచేతులారా ఠాగూర్ సినిమాని వదులుకున్న ఆ స్టార్ హీరో..టైం బ్యాడ్ అంటే...

చేతులారా ఠాగూర్ సినిమాని వదులుకున్న ఆ స్టార్ హీరో..టైం బ్యాడ్ అంటే ఇదే..!!

సినీ ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథ మరో హీరో కి వెళ్లడం చాలా కామన్ విషయమే. ఎందుకంటే ఒక హీరోకి తనకున్నా ఇమేజ్ కారణంగానో, వేరే కమిట్మెంట్ ల కారణంగానో, ఇంకా వేరే ఏమైనా కారణాలవలనో ఆ కధని రిజెక్ట్ చేయడం..ఇక అదే కధతో మరో హీరొ హిట్ కొట్టి కెరీర్ లో బ్లాక్ బస్టర్ విజయాని అందుకోవడం మనం చాలా సార్లు చూసి ఉంటాం. ఇక ఆ లిస్ట్ లోకే వస్తుంది ఈ ఠాగూర్ సినిమా.

చిరంజీవి కేరెర్లోనే పెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమా ఠాగూర్.ఫ్యాన్స్ కి ఈ సినిమా ఎంతగానో ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. ఇక అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన ఈ చిత్రం తమిళంలో ఏ ఆర్ మురుగదాస్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ రమణ సినిమాకు రీమేక్ గా వీవీ వినాయక్ డైరెక్షన్ లో ఠాగూర్ తెరకెక్కింది. మంచి మెసేజ్ తో పాటు పలు కమర్షియల్ హంగుల కలబోతగా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రియ హీరోయిన్ గా నటించగా మణిశర్మ సంగీతం అందించారు.

మ్యూజిక్ పరంగా కూడా ఈ సినిమా మంచి విజయం అందుకుంది. అప్పట్లో చిరు చెప్పిన డైలాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా తెలుగు భాషలో నాకు నచ్చని ఒక్కే ఒక పదం క్షమించడం అనే డైలాగ్ అయితే అందరు వాడేసుంటారు. చిరు ఇమేజ్ ను పెంచిన సినిమాల్లో ఠాగూర్ సినిమా కూడా ఒకటని చెప్పవచ్చు.

 

అవినీతి, లంచగొండితనాన్ని టార్గెట్ చేస్తూ తెరకెక్కిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించింది. ఇక ఇందులో ఠాగూర్ గా మెగా స్టార్ అత్యద్భుత నటనకు మెగా అభిమానులతో పాటు ఆడియన్స్ నుంచి కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే నిజానికి ఈ సినిమా మొదట యాంగ్రీ మెన్ రాజశేఖర్ చేతికి వెళ్ళిందట.

కానీ అప్పట్లో పలు సినిమాలో బిజీ గా ఉన్నా ఆయన డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల ఈ కథను వదులుకున్నారట. ఆ తరువాత మెగాస్టార్ తో వినాయక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం.. అది బ్లాక్ బస్టర్ అవ్వడం జరిగింది. అయితే రాజశేఖర్ ఏ సినిమా కోసం అయితే ఠాగూర్ సినిమాని రిజెక్ట్ చేశాడో ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. దీంతో ఈయన కెరీర్ గ్రాఫ్ డౌన్ అయ్యింది. ఒకవేళ ఈ ఠాగూర్ సినిమా రాజశేఖర్ చేసుంటే ఖచ్చితంగా ఆయన కెరీర్ మరోలా ఉండేది. ఏం చేద్దాం ఆయన బ్యాడ్ టైం అంటున్నారు నెటిజన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news