Moviesద్యావుడా.. సమంత కు అలాంటి కోరిక ఉందా..?

ద్యావుడా.. సమంత కు అలాంటి కోరిక ఉందా..?

సమంత..ఏ మాయ చేశావే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. ఒక్క సినిమాతోనే కుర్రాళ్లను తన వైపు తిప్పుకుంది. ఈ సినిమాలో సమంత నటనకు పర్ ఫామెన్స్ కు జనాలు ఫిదా అయ్యారు. దీంతో ఆమెకు ఏకంగా స్టార్ హీరోయిన్ల లిస్ట్ పేరు దక్కేలా చేశారు. ఇక ఆ తరువాత అమ్మడు సినీ లైప్ ఓ రేంజ్ లో దూసుకుపోయింది. అలా ఇలా కాదు. అప్పట్లో ప్రతి హీరోకి సమంతనే కావాలి..డైరెక్టర్లు,నిర్మాతల పాలిట అదృష్ట దేవతగా మారిపోయింది సమంత. దీంతో సమంత తక్కువ టైంలోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దక్షిణాదిలో సమంత స్టార్ హీరోలందరితో నటించింది. అంతే కాదు తనకు మాత్రమే సాధ్యమైన నటన, హావభాలతో లక్షలాది మంది అభిమానులని సొంతం చేసుకుంది.

కెరీర్ పీక్స్ టైంలో ఉండగానే యంగ్ హీరో నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుని అక్కినేని వారి కోడలిగా అడుగుపెట్టింది. కనీసం ప్రేమించినంత కాలమైన పెళ్లి బంధాని నిలుపుకోలేకపోయింది. నాలుగేళ్లకే వీళ్ల మధ్య గొడవలు వచ్చాయి..ఆ తరువాత విడాకుల నోటీసులుకూడా వచ్చాయి. అయితే ఆ తరువాత మొగుడిని వదిలేశాను అని బాధ పడుతూ కూర్చో లేదు ..పెళ్లి తర్వాత కంటే కూడా విడాకుల తరువాతనే వరుస సినిమాలతో సామ్ బిజీగా ఉంది. అయితే సినిమాలతో పాటు తనకు నచ్చిన ప్లేస్ లకి వెళ్తూ ఎంజాయ్ చేస్తూ..దానికి సంబంధించిన ఫోటోలు పెడుతూ..అద్దిరిపోయే విధయంగా క్యాప్షన్లు కూడా పెడుతుంది.

అయితే ఈ మధ్యనే సమంత కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. అది ఏమిటంటే సమంత కు చిన్నప్పటి నుండి స్వీట్స్ కన్నా కూడా ఐస్ క్రీమ్‌స్ అంటే చాలా ఇష్టమట. గడ్డకట్టే లాంటి చలిలో మైనస్ డిగ్రీలు ఉండే టైంలో తనకు ఇష్టమైన వ్యక్తితో కలిసి..ఐస్ క్రీమ్‌స్ షేర్ చేసుకుని తినాలి అనే కోరిక ఉండేదట. ఇండస్ట్రీలోకి రాకముందు బాగా ఐస్ క్రీమ్‌స్ తినేదట.. హీరోయిన్ అయ్యాక కూడా బాగా తింటూ వచ్చిందట. కానీ హీరోయిన్ గా సెటిల్ అవ్వాలంటే ఫిజిక్ మెయిన్ అంటూ క్రమక్రమంగా పూర్తిగా తగ్గించేసింది. పెళ్ళైయాక స్వీజర్ లెండ్ వెళ్లి చైతన్యతో ఇలానే చేద్దాం అనుకునిందట. కానీ వర్క్ అవుట్ అవ్వలేదు. ఇప్పుడు చై తో అలా చేయలేదు. మరి సమంత కోరిక ఎప్పుడు తీరుతుందో చూడాలి..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news