స్టార్ హీరోయిన్ సమంత ఫుల్ స్వింగ్‌లో ఉంది. చైతుతో విడాకుల తర్వాత సమంత జోరు మామూలుగా లేదు. పుష్ప సినిమాలో ఊ అంటావా అనే ఐటెం సాంగ్ చేసిన సమంత ఇప్పుడు బోల్డ్ రోల్స్ చేసే విషయంలో కూడా ఏ మాత్రం వెనుకాడడం లేదు. గుణశేఖర్ శాకుంతలం సినిమా చేస్తోన్న సమంత కోలీవుడ్‌లో క్రేజీ హీరో కార్తీ పక్కన మరో సినిమా చేస్తోంది. అటు బాలీవుడ్లో రెండు వెబ్‌సీరిస్‌ల్లో కూడా నటిస్తోంది. బోల్డ్‌గా యాక్ట్ చేసే విషయంలో సమంత ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇక యశోద సినిమా కూడా చేస్తోంది.
ఇక శాకుంతలం, యశోద సినిమాలకు అయితే పూర్తిగా సమంత పేరుతోనే బిజినెస్ జరుగుతోంది. ఇక సమంత వేసుకునే దుస్తులకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. దుస్తులు కొనుగోలు చేసే విషయంలో సమంత ఖర్చు పెట్టే విషయంలో ఎక్కడా రాజీపడరు. ఇక సమంత విడాకుల తర్వాత కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా పోస్టుల ద్వారా యాక్టివ్‌గా ఉంటోన్న సంగతి తెలిసిందే.
స్విట్జర్లాండ్‌లో సమంత స్కైయింగ్ చేస్తోన్న వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. సమంత షేర్ చేసిన ఈ ఫొటోలో ఆమె వేసుకున్న జాకెట్ ఖరీదు అక్షరాలా లక్ష పైనే ఉంటుందట. కరెక్టుగా చెప్పాలంటే ఈ జాకెట్ రేటు 1,21, 012 అట. ఇక స్కైయింగ్ సమయంలో ఆమె వేసుకున్న జాకెట్ రేటు 75 వేలకు పైనే అని సోషల్ మీడియాలో నడుస్తోన్న టాక్ ?
ఇక స్కైయింగ్ చేసేటప్పుడు సమంత కాస్త ఉల్లాసంగా ఉంటే… ఒక్కోసారి నిరుత్సాహంగా అనిపించిందని సమంత తెలిపారు. ఇక సోషల్ మీడియాలో కూడా సమంతకు తరచూ ఫాలోవర్స్ పెరుగుతున్నారు. ఇక విడాకుల తర్వాత సమంత సౌత్ మాత్రమే కాదు.. బాలీవుడ్‌పై కూడా ఎక్కువుగా కాన్సంట్రేషన్ చేస్తోంది.