టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా టాక్, జయాపజయాలతో సంబంధం లేకుండా పవన్ సినిమా వస్తుందంటే చాలు కలెక్షన్లు వచ్చి పడతాయి. ప్లాప్ అయిన సర్దార్ గబ్బర్‌సింగ్, కాటమరాయుడు లాంటి సినిమాలకు సైతం రు. 50 కోట్ల ఫస్ట్ డే ఓపెనింగ్స్ వచ్చాయంటే పవన్ రేంజ్ ఏంటో తెలుస్తోంది. 2018లో అజ్ఞాతవాసి తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకున్న పవన్ గతేడాది బాలీవుడ్ పింక్ రీమేక్ వకీల్‌సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. కరోనా దెబ్బతో అనుకున్న స్థాయిలో వసూళ్లు అయితే రాలేదు. ఇక పవన్ ఇప్పుడు వరుస పెట్టి సినిమలు చేసుకుంటూ పోతున్నాడు. భీమ్లానాయక్, భవదీయుడు భగత్‌సింగ్, హరిహర వీరమల్లు ఇలా వరుసగా క్రేజీ సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇక 2024 ఎన్నికలకు కూడా పవన్ రెడీ అవుతున్నాడు. ఇక పవన్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే తన మొదటి ఇద్దరు భార్యలకు దూరమైన పవన్ ఇప్పుడు మూడో భార్య అన్నా లెజ్నోవాతో ఉంటున్నారు.
పవన్ బద్రి, జానీ హీరోయిన్ రేణుదేశాయ్‌ను పెళ్లి చేసుకోవడానికి ముందే విశాఖకు చెందిన నందిని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇది చిరంజీవి కుదిర్చిన వివాహం.. పవన్ సినిమాల్లోకి రాకముందు నందినితో పెళ్లి జరిగింది. పవన్ సినిమాల్లోకి వచ్చాక స్టార్ హీరో అయ్యాడు. ఆ టైంలో పవన్ వైవాహిక జీవితంలో మనస్పర్థలు వచ్చాయి. నందిని – పవన్ కలిసి ఉండలేకపోయారు. ఎవరి జీవితాలు వారివి అయ్యాయి.
అయితే పవన్‌తో బద్రి సినిమా చేశాక ఆ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రేణుదేశాయ్‌తో పవన్ పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేశాడు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టాక విమర్శలు రావడంతో పవన్ రేణును అధికారికంగా పెళ్లి చేసుకున్నాడు. ఇక పవన్ తన మొదటి భార్య నందనికి విడాకులు ఇచ్చినప్పుడు భరణంగా రు. 30 లక్షలు ఇచ్చాడట. అయితే నందిని – పవన్ పెళ్లిని రు. 10 లక్షల ఖర్చుతో చిరంజీవి స్వయంగా చేశాడు.
పవన్ – నందిని నుంచి ఎలాంటి కట్నం ఆశించకుండానే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇక పవన్‌కు విడాకులు ఇచ్చేశాక నందిని.. వైజాగ్‌లోనే ఉంటూ ఓ డాక్టర్‌ను పెళ్లి చేసుకుంది.