Lifestyleపెళ్లి చేసుకోవ‌డానికి స్త్రీ, పురుషుల మ‌ధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉంటే...

పెళ్లి చేసుకోవ‌డానికి స్త్రీ, పురుషుల మ‌ధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉంటే మంచిదో తెలుసా..!

ఎవ‌రి జీవితంలో అయినా పెళ్లి అనేది ఓ మ‌ధుర‌ఘ‌ట్టం. దాంప‌త్య జీవితానికి పెళ్లి అనేది కీల‌కం. ఇక పెళ్లి అనేది ప్ర‌పంచ వ్యాప్తంగా ఎలా ఉన్నా మ‌న‌దేశంలో మాత్రం సంప్ర‌దాయంగానే ఎక్కువుగా జ‌రుగుతూ ఉంటుంది. ఈ క్ర‌మంలో మ‌న‌దేశంలో పెళ్లి విష‌యంలో స్త్రీ, పురుషుల మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువుగా చూస్తూ ఉంటారు. పురాణాల నుంచి మ‌న పెళ్లిళ్ల‌లో అబ్బాయిల వ‌య‌స్సు కంటే స‌హ‌జంగానే అమ్మాయిల వ‌య‌స్సు త‌క్కువుగా ఉంటుంది. గతంలో ఒక‌టి రెండు చోట్ల మాత్ర‌మే అబ్బాయిల కంటే ఎక్కువ వ‌య‌స్సు ఉన్న అమ్మాయిలు పెళ్లిళ్లు చేసుకునేవారు.

అయితే స‌చిన్ టెండుల్క‌ర్ లాంటి స్టార్ క్రికెట‌ర్ సైతం త‌న కంటే వ‌య‌స్సులో 6 ఏళ్లు పెద్ద అయిన అంజ‌లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇటీవ‌ల కాలంలో అబ్బాయిల కంటే వ‌య‌స్సులో పెద్ద‌ది అయిన అమ్మాయిల‌ను పెళ్లి చేసుకోవ‌డం కామ‌న్ అవుతోంది. ఇక కులాంత‌ర, మ‌తాంత‌ర‌ వివాహాలు కూడా చాలా మామూలు అయిపోయాయి. అస‌లు భార్య‌, భ‌ర్త‌ల మ‌ధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉండాలి.. భార్య క‌న్నా భ‌ర్త వ‌య‌స్సులో ఎంత పెద్ద‌వాడు అయ్యి ఉండాలి.. అనేందుకు కొన్ని నిబంధ‌న‌లు ఉన్నాయి. వాటి గురించి ఓ సారి తెలుసుకుందాం.

1 – 4 ఏళ్ల ఏజ్ గ్యాప్ :
మ‌న దేశంలో 21 ఏళ్లు దాటితే పెళ్లి చేసేయ‌వ‌చ్చు. అయితే 21 ఏళ్లు వ‌చ్చిన వెంట‌నే పెళ్లి చేసుకునేవారు ఎక్కువుగా ఉంటున్నారు. అయితే 21 ఏళ్లు దాటిన వెంట‌నే పెళ్లి చేసుకున్న‌… భార్య‌, భ‌ర్త‌ల మ‌ధ్య 1-4 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఉన్న‌ప్పుడు కొన్ని అనుకూల‌త‌లు, కొన్ని ప్ర‌తికూల‌త‌లు కూడా ఉంటున్నాయి. ఈ వ‌య‌స్సులో పెళ్లి చేసుకుంటే మొండిత‌నం వ‌ల్ల కొన్ని స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి. అయితే వీరు త‌మ హ‌ద్దుల్లో ఉండ‌క‌పోవ‌డంతో కొన్ని శాశ్వ‌త‌మైన స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. అందుకే వీరి వైవాహిక బంధంలో త‌క్కువ టైంలోనే గ్యాప్ వ‌స్తుంద‌ట‌. ఇప్పుడు విడాకులు తీసుకుంటోన్న వారిలో ఈ ఏజ్ గ్యాప్ వాళ్లే ఎక్కువుగా ఉంటున్నారు.

5- 7 ఏజ్ గ్యాప్ :
ఈ వ‌య‌స్సు ఏజ్ గ్యాప్ ఉన్న జంట‌ల్లో ఎక్కువ మంది త‌క్కువ విబేధాలు, అన‌ర్థాల‌తో ఉంటారు. భాగ‌స్వాముల్లో ఎల్ల‌ప్పుడూ ఒక‌రికొక‌రు ప‌రిప‌క్వ‌త క‌లిగి ఉంటారు. అన్నింటికి మించి ఒక‌రినొక‌రు అర్థం చేసుకుంటారు. వీరు దాంప‌త్య జీవితంలో గొడ‌వ‌లు ప‌డినా కూడా స‌హ‌నంతో ఉంటారు. వైవాహిక బంధం స్థిర‌త్వంతో ఉండేందుకు ఒక‌రినొక‌రు స‌న్నిహితంగా భార్య‌భ‌ర్త‌లు గానే కాకుండా స్నేహితులుగా కూడా ఉంటారు.

 

10 ఏళ్ల‌కు పైన ఏజ్ గ్యాప్ :
భార్య‌, భ‌ర్త‌ల మ‌ధ్య త‌గినంత ఏజ్ గ్యాప్ ఉంటే 10 సంవ‌త్స‌రాల అంత‌రం, ఏజ్ గ్యాప్ ఉన్నా పెద్ద ఇబ్బంది ఉండ‌ద‌ని అంటారు. మ‌న‌దేశంలో పెళ్లికాని ప్ర‌సాద్‌లు ఎక్కువుగా ఉండ‌డం, కొన్ని కులాల్లో ఇంత ఏజ్ గ్యాప్‌తో ఎక్కువుగా వివాహాలు న‌డుస్తున్నాయి. అయితే ఇటీవ‌ల కాలంలో యువ‌తులు, చ‌దువుకున్న అమ్మాయిలు ఇంత ఏజ్ గ్యాప్‌తో భ‌ర్త‌ల‌ను స్వీక‌రించేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు. సాధార‌ణ జంట‌ల‌కు ఈ గ్యాప్ కొంచెం ఎక్కువే అనిపించ‌వ‌చ్చు. కొన్ని జంట‌ల్లో యువ భాగ‌స్వామి ప‌రిప‌క్వ ద‌శ‌కు చేరుకోక‌పోవ‌డంతో ఇది చాలా స‌మ‌స్య‌ల‌కు కార‌ణ‌మ‌వుతుంది.

20 సంవ‌త్స‌రాల ఏజ్ గ్యాప్‌..
సాధార‌ణంగా ఇంత ఎక్కువ ఏజ్ గ్యాప్‌తో ఎవ్వ‌రూ పెళ్లిళ్లు చేసుకోరు. అయితే ఇటీవ‌ల సెల‌బ్రిటీలు కూడా ఇంత ఏజ్ గ్యాప్ ఉన్న వారినే వివాహం చేసుకునేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు. సినిమా, పారిశ్రామిక వేత్త‌లు అప్ప‌టికే ఒక‌టి రెండు పెళ్లిళ్లు చేసుకుని త‌మ కంటే వ‌య‌స్సులో 20 ఏళ్లు చిన్న‌వాళ్లు అయిన యువ‌తుల‌ను పెళ్లి చేసుకునేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. అయితే మామూలుగా దాంప‌త్య జీవితంలో ఇది పురుషుడి సంతానోత్ప‌త్తితో పాటు ఒక‌రిభావాల‌ను మ‌రొక‌రు అర్థం చేసుకునే విష‌యంలో అనేక స‌మ‌స్య‌ల‌కు కార‌ణ‌మ‌వుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news