Moviesబాప్‌రే..బ్రహ్మీ ఆస్తుల విలువ అన్నీ కోట్లా..స్టార్‌ హీరోలకు కూడా లేవుగా..!!

బాప్‌రే..బ్రహ్మీ ఆస్తుల విలువ అన్నీ కోట్లా..స్టార్‌ హీరోలకు కూడా లేవుగా..!!

సినీ ఇండస్ట్రీలోకి రావడం గొప్ప కాదు. వచ్చిన తరువాత ఆ పేరుని అందరికి తెలిసేలా చేసుకోవడంతో పాటు..వచ్చిన పేరుని పొగొట్టుకోకుండా మెయిన్ టైన్ చేయగలిగినవాడే నిజమైన ఆర్టిస్ట్. అలాంటి కళాకారులు చాలా తక్కువ మందే ఉన్నారు మన ఇండస్ట్రీలో. అలాంటి వారిలో కమెడియన్ బ్రహ్మానందం కూడా ఓక్రు. టాలీవుడ్ లో ఒకప్పుడు రేలంగికి ఎంతటి ఇమేజ్ ఉండేదో మనకు తెలిసిందే. అంతలా ఇప్పుడు ఈ జనరేషన్ లో బ్రహ్మానందం పేరు సంపాదించుకున్నాడు.

టాలీవుడ్ ఆల్ టైమ్ బెస్ట్ కమెడియన్స్ లలో ఒకరైన బ్రహ్మానందం అంటే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. నార్త్ లో కూడా ఓ వర్గం ఆడియెన్స్ ఆయనను ఎంతగానో ఇష్టపడతారు.బ్రహ్మీ గా పాపులర్ తెచ్చుకున్న బ్రహ్మానందం ఒకదశలో మోస్ట్ వాంటెడ్ కమెడియన్‌గా మారిపోయాడు. తక్కువ సమయంలో దాదాపు వెయ్యి సినిమాల్లో నటించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఎక్కారు. ఒక్కో కాల్షీట్ కి రూ. లక్ష చార్జ్ చేస్తున్నారు. కొన్నిసార్లు ఒక సినిమాకే ఈయన రూ. కోటి వరకు పారితోషకం తీసుకున్న సందర్భాలున్నాయట. దాదాపు ప్రతి యంగ్ హీరో, స్టార్ హీరో,లెంజడరీ హీరోల సినిమాల్లో నటించారు బ్రహ్మానందం.

బ్రహ్మానందం డబ్బు దగ్గర ఎంత గట్టిగా ఉంటారంటే ఎంతటి సన్నిహితులైనా..క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే బ్రహ్మానందం ఒక్క పైసా కూడా వదలివారు కాదట. డబ్బిస్తేనే ఆ సినిమాలో యాక్ట్ చేస్తా అన్న రేంజ్ లో బ్రహ్మీ కెరీర్ సాగిందట. ఇక డబ్బు విలువ తెలిసిన ఈయన ప్రతి రూపాయని జాగ్రత్తగా ఖర్చు చేస్తాడట. అనవసరపు ఖర్చులంటే బ్రహ్మానందం కి కోపం వస్తుందట.

అందుకే సంపాదించిన ప్రతి రూపాయి రేపటి రోజున ఉపయోగపడేలా..ఆ సొమ్ముని కొన్ని రియల్ ఎస్టేట్స్ లో పెట్టుబడులు పెట్టడంతో పాటు మరికొన్ని వ్యాపారాల్లో భాగస్వామిగా ఉపయోగించారట. ఇక అలా కొన్ని వందల సినిమాలు చేసిన ఈయన ఎంత ఆస్తి కూడబెట్టారో తెలిస్తే..షాక్ అవ్వడం ఖాయం. ఎందుకంటే..అంత ఆస్తి స్టార్ హీరోలకు కూడా లేదట. ఇక ఎక్కువగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టిబడి పెట్టిన బ్రహ్మానందం..మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.400కోట్ల నుండీ రూ.450 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. దుర‌ల‌వాట్లు కూడా ఆయ‌నకు పెద్ద‌గా ఏమి లేక‌పోవ‌డంతో బాగానే కూడ‌బెట్టిన‌ట్టు తెలుస్తుంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news