తెలుగు సినిమా కరోనా సెకండ్ వేవ్ తర్వాత కొద్ది రోజులుగా వరుసగా హిట్లు వస్తున్నాయి. డిసెంబర్లో అఖండ, పుష్పతో సంక్రాంతికి బంగార్రాజుతో మాంచి కళ వచ్చింది థియేటర్లకు.. ఫిబ్రవరిలో ఖిలాడి, డిజె టిల్లుతో రెండు అంచనాలు ఉన్న సినిమాలు వచ్చేశాయి. తెలంగాణలో కాస్త రేట్లు ఎక్కువ అయినా.. ఆంధ్రాలో తక్కువ అయినా కూడా ఓవరాల్‌గా థియేటర్లు కళకళలాడాయి. ఏపీలో ప్రస్తుతం 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఉండడంతో థియేటర్లు హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. కాకినాడ, గుంటూరు లాంటి చోట్ల కూడా డిజె టిల్లుకు 7-8 థియేటర్లు పెడితే అన్నీ హౌస్ ఫుల్స్ పడుతుండడమే ఇందుకు కారణం.
అయినా ఈ చిన్న సినిమాకు 50 శాతం ఆక్యుపెన్సీ అన్నది మంచి ప్రారంభమే. ఇదిలా ఉంటే నిన్న మాస్ మహరాజ్ రవితేజ నటించిన ఖిలాడి సినిమా రిలీజ్ అయ్యింది. రవితేజ గతేడాది క్రాక్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి ఉన్నాడు. ఖాలాడీ కూడా డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి అందాలతో భారీ ఆశలతోనే రిలీజ్ అయ్యింది. తొలి రోజు వసూళ్లు ఓకే అనిపించాయి. అయితే కంటెంట్ వీక్ అన్న టాక్ రావడంతో పాటు రెండో రోజు యూత్‌లో రిలీజ్‌కు ముందే మంచి ఆశలు పెంచేసిన డిజె టిల్లు రిలీజ్ అవ్వడంతో చాలా వరకు డ్రాఫ్ అయిపోయింది.
సిద్ధు జొన్నలగడ్డ యాట్యిట్యూడ్‌కు తోడు సినిమాలో డైలాగులు, మేనరిజమ్స్, కామెడీ బాగుందన్న టాక్ స్ప్రెడ్ అయిపోవడంతో డిజె టిల్లుకు తొలి రోజే భారీ ఓపెనింగ్స్ ఖాయంగా కనిపిస్తున్నాయి. ఏపీలో విశాఖ, విజయవాడ, గుంటూరు, కాకినాడ లాంటి సిటీల్లో టిల్లు థియేటర్లు ఫుల్ అవుతున్నాయి. ఫస్ట్ షోకు కూడా భారీగానే టిక్కెట్లు బుక్ అవుతున్నాయి. కేవలం ఏపీ, తెలంగాణలోనే కాకుండా అటు ఓవర్సీస్‌లో కూడా అదిరే వసూళ్ల హంగామా తోనే టిల్లు తన హవా ని స్టార్ట్ చేసింది.
ఓవర్సీస్‌లో జస్ట్ ప్రీమియర్లతోనే కంగా లక్ష డాలర్లను అందుకుని సాలిడ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా లాంగ్ రన్‌లో భారీ లాభాలు సొంతం చేసుకోనుంది. ఏదేమైనా ఖిలాడికి టిల్లు దెబ్బ మామూలుగా లేదు.