ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో విడాకులు అనేవి చాలా కామన్ అయిపోయాయి. ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు చిన్న చిన్న విషయాలకే స్పర్థలు రావడం.. సర్దుకుపోకపోవడంతో వారు చాలా సింపుల్‌గా విడాకులు తీసేసుకుంటున్నారు. మరి కొందరు సినిమా స్టార్లు పెళ్లికి ముందు తమ భాగస్వామితో ఓ విధమైన ప్రేమతో ఉంటారు. ఆ తర్వాత ఇతర ఆకర్షణలకు లోను కావడంతో ముందు భాగస్వామికి చాలా సింపుల్‌గా దూరమైపోతున్నారు.
ఇక విడాకులు తీసుకుని.. ఇప్పుడు మళ్లీ కొత్తగా సహజీవనాలు ప్రారంభించడమో లేదా.. రెండో పెళ్లికి రెడీ అయిన సినిమా నటులు ఎవరెవరో ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ హీరో & డైరెక్టర్ పర్హాన్ అక్తర్ రెండో పెళ్లికి రెడీ అయ్యాడు. తన ప్రేయసి షిబా దండేకర్‌తో కొత్త జీవితం స్టార్ట్ చేశాడు. తన 16 ఏళ్ల వైవాహిక జీవితానికి విడాకులతో స్వస్తి పలికేసిన పర్హాన్ అక్తర్ షిబా దండేకర్‌తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు.
ఇక వెటరన్ హీరోయిన్ మలైకా అరోరా, యంగ్ హీరో అర్జున్ కపూర్ సహజీవనం ఎప్పటికప్పుడు వార్తల్లో ఉంటూనే వస్తోంది. వీరు ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతారా ? అని ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. బాలీవుడ్ ప్రేమపక్షల్లా ఏ దేశంలో చూసినా వీరే కనిపిస్తూ ఉంటారు. వయస్సులో తన కన్నా 10 ఏళ్లకు పైగా పెద్దది అయిన మలైకాను విడిచి అర్జున్ ఉండలేకపోతున్నాడు.
సల్మాన్‌ఖాన్ తమ్ముడు అర్బాజ్‌ఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని..ఇద్దరు పిల్లల తల్లి అయిన మలైకా ఇప్పుడు అర్జున్‌తో సహజీవనం చేస్తోంది. ఇక విడాకుల తర్వాత అర్బాజ్ సైతం జార్జియా ఆండ్రియాతో రిలేషన్లో ఉన్నాడు. త్వరలో వీరిద్దరు కూడా పెళ్లికి రెడీ అవుతున్నారట. ఇక బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తన చిన్ననాటి ప్రియురాలు సుసానే ఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
ఆమెకు విడాకులు ఇచ్చేసిన హృతిక్ యువ హీరోయిన్ సభా ఆజాద్‌తో ప్రేమలో ఉన్నాడు. 48 ఏళ్ల హృతిక్, 31 ఏళ్ల సభాతో ప్రేమలో ఉండడం బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఎక్కడ చూసినా ప్రస్తుత వీరిద్దరే కనిపిస్తున్నారు.
ఇక బాలీవుడ్ హాట్ హీరోయిన్ కిమ్‌శర్మ ఎంతమందితో ఎఫైర్లతో వార్తల్లోకి ఎక్కిందో చూశాం. కెన్యాకు చెందిన ఓ పారిశ్రామికవేత్తను ( వయస్సులో ఆమె కంటే పెద్దోడు) పెళ్లి చేసుకున్న ఆమె ఇప్పుడు అతడికి
విడాకులు ఇచ్చేసి భారత మాజీ టెన్సీస్ స్టార్ లియాండ్ పేస్‌తో ప్రేమాయణం కొనసాగిస్తోంది. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న పేస్ తన భార్యకు విడాకులు ఇచ్చేసి కిమ్‌తో రెండో పెళ్లికి రెడీ అవుతున్నాడు.
ఇక అక్కినేని హీరో నాగచైతన్య సైతం స్టార్ హీరోయిన్ సమంతతో విడాకులు తీసుకున్నారు. నాలుగేళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న వీరు పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నారు. ఇక చైతుకు మళ్లీ పెళ్లి చేసేందుకు తండ్రి నాగార్జున రెడీ అవుతున్నారు. విజయవాడకు చెందిన సంప్రదాయ కుటుంబానికి చెందిన యువతితో చైతు రెండో పెళ్లి ఉంటుందని టాక్ ?