ఏ సినిమాకు అయినా సెకండాఫ్ కీలకం… ఫస్టాఫ్ సోసోగా ఉన్నా.. సెకండాఫ్ బాగుంటేనే సినిమా హిట్ అవుతుంది. ఇక క్లైమాక్స్ అనేది సినిమాకు ఆయువుపట్టు. క్లైమాక్స్ ఎంత బలంగా ఉంటే సినిమా రేంజ్ అంత ఎక్కువుగా ఉంటుంది. సినిమా మొత్తం ఎలా ఉన్నా కూడా క్లైమాక్స్‌తో ప్రేక్షకుడు సంతృప్తి చెందితేనే థియేటర్ నుంచి మోముపై చిరునవ్వుతో బయటకు వస్తాడు. కొన్ని సినిమాలు స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు ఎంత బాగున్నా.. క్లైమాక్స్ వీక్‌గా ఉండడంతో డిజాస్టర్ అయ్యాయి.
అలా తెలుగులో సినిమా స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు మంచి టాక్ తెచ్చుకున్నా.. వీక్ క్లైమాక్స్‌తో ప్లాప్ అయిన సినిమాలేంటో చూద్దాం.
శీను:
విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన శీను సినిమా కథ అప్పట్లో ఓ సంచలనం. బాలీవుడ్ హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా హీరోయిన్‌గా చేసిన ఈ సినిమాకు ఐవి. శశి ( బిచ్చగాడు ఫేం) దర్శక్వత్వం వహించారు. అయితే హీరో నాలుక కోసుకోవడంతో పాటు వీక్ క్లైమాక్స్ ఈ సినిమా రిజల్ట్ ప్రభావితం చేసింది.
వేదం:
క్రిష్ దర్శకత్వంలో మంచు మనోజ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జంటగా వచ్చిన సినిమా వేదం. అనుష్క కూడా ఈ సినిమాలో వేశ్యగా నటించింది. కథా పరంగా ఈ సినిమా ఎక్కువ మంది మనస్సులు దోచుకుంది. అయితే క్లైమాక్స్ వీక్‌గా ఉండడంతో ఈ సినిమా ప్లాప్ అయ్యింది. క్లైమాక్స్‌లో ఇద్దరు హీరోలు చనిపోవడంతో ఈ సినిమా కమర్షియల్‌గా హిట్ కాలేదు.
చక్రం:
ప్రభాస్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమా చక్రం. చక్రంలో సెంటిమెంట్ మరీ ఓవర్ అయిపోయింది. దీనికి తోడు క్లైమాక్స్ వీక్‌గా ఉండడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది.
భీమిలి కబడ్డీ జట్టు:
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన భీమిలి కబడ్డీ జట్టు ఫస్టాఫ్ అంతా ఎంతో ఆసక్తితో ఉంటుంది. కానీ చివర్లో నాని చనిపోవడంతో ఈ సినిమా కూడా ప్రేక్షకులకు ఎక్కలేదు.
మెరుపు కలలు:
ప్రభుదేవా – కాజోల్ – అరంద స్వామి కాంబినేషన్లో వచ్చిన మెరుపు కలలు సినిమా కూడా కథ, కథనాల పరంగా బాగుంటుంది. అయితే క్లైమాక్స్ వీక్ అవ్వడంతో ప్లాప్ అయ్యింది.
ఏదేమైనా సినిమా క్లైమాక్స్ వీక్‌గా ఉంటే ఎంత ఎఫెక్ట్ పడుతుందో పై సినిమాలే ఉదాహరణ. సినిమా కమర్షియల్ సక్సెస్‌కు క్లైమాక్స్ అనేది ఎప్పుడు అయినా ఆయువుపట్టుగా ఉంటుంది.