సినిమా రంగం అంటేనే ఓ గ్లామర్ ఫీల్డ్. ఇక్కడ ప్రతి రోజు రకరకాల వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఇక ఒకరిద్దరు హీరో, హీరోయిన్లు ఎక్కువ అక్కర్లేదు.. జస్ట్ రెండు సినిమాల్లో కనిపిస్తే చాలు వారిద్దరి మధ్య ఏదేదో ఉందని రకరకాలుగా ఊహించేసుకుంటూ ఉంటారు. ఇక ఇప్పుడు హీరో, హీరోయిన్ సినిమాలో నటించాల్సిన అవసరం లేదు.. కాస్త క్లోజ్‌గా ఉంటేనే వారిద్దరి మధ్య బంధం ఉందని రకరకాలుగా ఊహించేసుకుంటున్నారు.
ఇది ఇప్పుడే కాదు.. గత కొన్ని దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉందే..! ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది నదియా. మళయాళ అమ్మాయి అయినా ఆమె తెలుగుతో పాటు తమిళంలో ఎన్నో సినిమాలు చేసింది. 1980 – 1985 టైంలో ఆమె తన అంద చందాలతో ఓ ఊపు ఊపేసింది. తర్వాత చాలా యేళ్లకు ఆమె తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రభాస్ మిర్చిలో అమ్మగా, అత్తారింటికి దారేదిలో పవన్‌కు అత్తగా తన నటనతో మెప్పించేసింది.
ఇప్పుడు నదియా అంటే పవన్ అత్త అన్న పదం బాగా పాపులర్ అయిపోయింది. అప్పట్లో నదియా సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కొడుకు రమేష్‌బాబుతో కూడా బజార్‌రౌడీ లాంటి హిట్ సినిమాలు చేసింది. ఆ టైంలో సీనియర్ హీరో సురేష్ – నదియా కాంబోలో ఎన్నో సినిమాలు వచ్చాయి. వారిద్దరి కాంబినేషన్ బాగుండడంతో దర్శక నిర్మాతలు కూడా కొన్ని సినిమాలలో వీరినే రిపీట్ చేశారు. ఇంకేముందు అప్పటి సినీ వార పత్రికల్లో వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని.. వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చేశాయి.
వాస్తవంగా సినిమాల్లో ఈ జంట ఎంత బాగున్నా.. బయట వీరిద్దరు స్నేహితులుగా ఉండేవారు. తమ మధ్య ఏం లేకున్నా ఈ రూమర్లు రావడంతో ఆ తర్వాత సురేష్ నదియాతో సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేశాడు. తర్వాత తన పక్కన హీరోయిన్లు రిపీట్ కాకుండా చూసుకుంటూ వచ్చాడు. తర్వాత చాలా మంది దర్శక నిర్మాతలు సురేష్ – నదియా కాంబో రిపీట్ చేసేందుకు ప్రయత్నించినా సురేష్ ఒప్పుకోలేదు.
ఇక సురేష్ కూడా సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చారు. ఆయన తండ్రి చంద్రశేఖర్ ఎన్టీఆర్‌తో రాముని మించిన రాముడు సినిమా స్వీయ నిర్మాణంలో తెరకెక్కించారు. ఇక సురేష్ అప్పటి హీరోయిన్ అనితారెడ్డిని ప్రేమవివాహం చేసుకున్నాడు. ఆమెతో ఓ బాబు పుట్టాక మనస్పర్థలు రావడంతో ఆమెకు విడాకులు ఇచ్చేసి మరో పెళ్లి చేసుకున్నాడు. నదియా 1998లో శిరిష్ గాడ్ బోలె అనే ఒక బిజినెస్ నాని వివాహం చేసుకొని, సినిమాలకు స్వస్తి పలుకుతూ అమెరికాకు వెళ్లిపోయింది. ఆ తర్వాత లాంగ్ గ్యాప్‌తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.