మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ఇద్దరూ కూడా నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. వీరిద్దరి ప్రస్థానం వేర్వేరుగా ఉంటుంది. చిరంజీవికి కెరీర్ స్టార్టింగ్‌లోనే స్టార్‌డమ్ వచ్చేసింది. మెగాస్టార్‌గా ఈ రోజు ఓ వెలుగు వెలుగుతున్నారు. చిరంజీవి వేసిన బీజంతోనే ఈ రోజు మెగా ఫ్యామిలీ నుంచి ఏకంగా 12 మంది హీరోలు ఇండస్ట్రీలోకి వచ్చి హీరోలు అయ్యారు.
ఇక మోహన్‌బాబు కెరీర్ స్టార్టింగ్‌లో విలన్ వేషాలు వేశారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు. ఆ తర్వాత హీరో అయ్యి.. నిర్మాతగా మారారు. ఇప్పుడు ఈ ఇద్దరు అగ్ర హీరోల వారసులు కూడా సినిమాల్లోకి వచ్చి రాణిస్తున్నారు. ఇద్దరూ రాజకీయాల్లోకి వచ్చారు. అయితే వీరి మధ్య బంధం టామ్ అండ్ జెర్రీలా ఉంటుంది. ఎప్పుడు కలిసి ఉంటారో ? ఎప్పుడు విడిపోతారో కూడా ఎవ్వరికి తెలియదు.
గతంలో వీరిద్దరు కలిసి కొన్ని సినిమాల్లో కూడా నటించారు. వజ్రోత్సవాల టైం నుంచి వీరి మధ్య ఎప్పుడూ ఏదో ఒక గొడవ నడుస్తూనే ఉంటుంది. ఇటీవల మా ఎన్నికలు, ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రితో ఇండస్ట్రీ పెద్దలు భేటీ లాంటి అంశాలు కూడా ఇద్దరి మధ్య గ్యాప్‌ను మరింత పెంచాయి. ఇక మోహన్‌బాబు కూడా తనకు ముఖ్యమంత్రి సమావేశానికి ఆహ్వానం వచ్చినా కొందరు కావాలనే చెప్పలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అందరి దృష్టి చిరంజీవి మీద పడింది.
ఇక తాజాగా మోహన్‌బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియా సినిమా వచ్చింది. ఈ సినిమా చిరంజీవి వాయిస్ ఓవర్‌తోనే స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా డైరెక్టర్ డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ సన్ ఆఫ్ ఇండియా సినిమాలో మోహన్‌బాబు పాత్రను పరిచయం చేస్తూ పవర్ ఫుల్ వాయిస్ ఉండాలని అనుకున్నామని.. ఆ ఆలోచన తనకు వచ్చి మోహన్‌బాబుకు చెప్పానన్నారు. తాము చిరంజీవికి గారికి ఫోన్ చేసిన వెంటనే ఓకే చెప్పి మరుసటి రోజు వాయిస్ ఓవర్ చెప్పారని రత్నబాబు తెలిపారు.
వాళ్లిద్దరి మధ్య అంతటి స్నేహం ఉందని.. చిరంజీవి – మోహన్‌బాబు స్నేహబంధం ఎప్పటకీ అలాగే ఉంటుందని… వీళ్లు విడిపోయార్రా అని అనుకునే వాళ్లే భ్రమల్లో తేలుతుంటారని ఆయన వెల్లడించారు. గతంలో మోహన్‌బాబు సైతం ఓ సందర్భంలో తమ మధ్య చిన్నా చితకా అలకలు ఉన్నా ఎప్పటకీ తమ బంధం చెక్కు చెదరదని చెప్పారు. మరి ఈ సారి ఉన్న చిన్న గ్యాప్ ఎప్పుడు ముగుస్తుందో ? చూడాలి.