యువరత్న నందమూరి బాలకృష్ణ కెరీర్ ఎంతలా స్వింగ్‌తో ఉందో చూస్తూనే ఉన్నాం. అఖండ సినిమా రిలీజ్‌కు నెల రోజుల ముందే తెలుగు సినీ ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులు అఖండ మానియాలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఎవరి నోట విన్నా కూడా అఖండ నామస్మరణ మార్మోగుతూ వస్తోంది. అఖండ సినిమా వచ్చి 50 రోజులు దాటేసి 70 రోజులకు చేరువ అవుతోంది. అయినా కూడా ఇంకా చాలా చోట్ల అఖండ గర్జన వినిపిస్తూనే ఉంది. బాలయ్య కెరీర్‌లోనే రు. 200 కోట్ల వసూళ్లు రాబట్టిన తొలి సినిమాగా రికార్డులకు ఎక్కిన అఖండ 103 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుని.. చాలా రోజుల తర్వాత 100 కేంద్రాల్లో 50 రోజులు ఆడిన సినిమాగా థియేటర్లకు పాత కళ తీసుకువచ్చింది.
ఇక ఇటు బుల్లితెరపై బాలయ్య హోస్ట్ చేస్తోన్న టాక్ షో అన్‌స్టాపబుల్ షో సూపర్ సక్సెస్ అయ్యింది. 40 కోట్ల నిమిషాల పాటు వీక్షించిన షోగా అన్‌స్టాపబుల్ రికార్డులకు ఎక్కింది. ఫస్ట్ సీజన్లో ఇప్పటికే 10 ఎపిసోడ్లు పూర్తయ్యాయి. ఫస్ట్ సీజన్లో మోహన్‌బాబు – నాని – బన్నీ – మహేష్‌బాబుతో పాటు దర్శకులు బోయపాటి శ్రీను – సుకుమార్ – మలినేని గోపీచంద్ లాంటి వాళ్లు ఈ టాక్ షోకు వచ్చారు.
అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ షోకు ఎందుకు రాలేదన్న ప్రశ్న ఎక్కువ మంది మదిని తొలచి వేస్తోంది. ఈ షోకు రైటర్‌గా వ్యవహరించిన బీవీఎస్ రవి ఈ ప్రశ్నకు క్లారిటీ ఇచ్చారు. ఈ షోలో చిరంజీవితో కూడా ఓ ఎపిసోడ్ ప్లాన్ చేశామని.. అయితే అప్పుడే బాలయ్య తన భుజానికి శస్త్రచికిత్స చేయించుకోవడం.. మరోవైపు చిరంజీవి వరుసగా తన సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ ఎపిసోడ్‌కు సరైన టైం కుదర్లేదని చెప్పారు.
దీనిని బట్టి అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్లో బాలయ్యతో చిరు షో ఉంటుందని ఫిక్స్ అవ్వొచ్చు. ఇక ఫస్ట్ సీజన్లో రానాతో పాటు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా వచ్చేలా షో అనుకున్నారు. అయితే వెంకీ షూటింగ్‌లో బిజీగా ఉండడంతో చివరకు రానాతోనే ఆ షో ఫినిష్ చేశారు. ఇక రెండో సీజన్‌ను జూలై నుంచి ప్లాన్ చేస్తున్నట్టు ఆహా టీం చెప్పింది.