పవర్‌స్టార్ పవన్కళ్యాణ్ సినిమా కెరీర్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. యావరేజ్ టాక్ వచ్చినా సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ స్థాయిలో వసూళ్లు సాధించే సత్తా పవన్ కళ్యాణ్ సినిమాల సొంతం. డిజాస్టర్ అయినా సర్దార్ గబ్బర్ సింగ్ – కాటమరాయుడు సినిమాలు కూడా 55 నుంచి 60 కోట్ల షేర్ రాబట్టాయి. పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ లలో తొలిప్రేమ సినిమా ఒకటి. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు గెలుచుకున్న తొలిప్రేమ వచ్చి రెండు దశాబ్దాలు దాటుతున్నా కూడా ఈ తరం ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుంది. ఎస్ ఎస్ సీ ఆర్ట్స్ బ్యానర్‌పై జీవీజీ రాజు నిర్మించిన ఈ సినిమాకు ఎ. కరుణాకరన్ దర్శకత్వం వహించారు.
1998లో వచ్చిన తొలిప్రేమ యూత్‌లో పవన్ కళ్యాణ్‌కు తిరుగులేని క్రేజ్ తెచ్చిపెట్టింది. కీర్తిరెడ్డి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు దేవా సంగీతం అందించారు. ఈ సినిమాలో పాటలు ఇప్పటికీ యువతను ఉర్రూతలూగించేస్తాయి. ఈ సినిమా గురించి టాలీవుడ్ ప్రముఖ ఎడిటర్ లో ఒకరు అయిన మార్తాండ్. కె.వెంకటేష్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పవన్ కు డెడికేషన్ ఎక్కువని… ఇతర హీరోల సినిమాల గురించి ఆయన పెద్దగా పట్టించుకోరు అని వెంకటేష్ తెలిపారు.
పవన్ ప్రతి ఒక్కరితో ఒక్క కుటుంబ సభ్యుడిలా కనెక్ట్ అవుతారని… ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే తన వంతుగా సహాయం చేస్తారని ఆయన చెప్పారు. తాను తొలిప్రేమ సినిమాకు నంది అవార్డు కూడా అందుకోవటం సంతోషంగా ఉందని చెప్పారు. తాము రిలీజ్‌కు ముందే తొలిప్రేమ సినిమా ఫ్రివ్యూ చూసి బాగుందని ఫీల్ అయ్యామని… అయితే బయ్యర్లు మాత్రం సినిమా చూస్తున్నప్పుడు నిద్ర పోయారు అని వెంకటేష్ చెప్పారు.
ఒక బయ్యర్ అయితే డైరెక్టర్ ను పిలిచి సాంగ్స్‌లో ఒక్క ఫిమేల్ వాయిస్ కూడా లేదు.. మీకు ఆడవాళ్లంటే ఇష్టం లేదా ? అని అడిగారని వెంకటేష్ చెప్పుకొచ్చారు. అయితే తొలిప్రేమ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పాటు ఎన్నో రికార్డులు, రివార్డులు, అవార్డులు సొంతం చేసుకుందని వెంకటేష్ తెలిపారు.