తెలుగు సినిమా పరిశ్రమలో టాలెంట్ తో పాటు కాస్త అందం ఉంటే చాలు హీరోయిన్‌గా నిలదొక్కేయవచ్చు. కేవలం గ్లామరసం పండించే హీరోయిన్లు మాత్రమే కాదు టాలెంట్‌తో గ్లామర్ అన్న పదానికి దూరంగా ఉన్న హీరోయిన్లు కూడా మన తెలుగులో ఒక వెలుగు వెలిగారు. సౌందర్య లాంటి హీరోయిన్లు ఏళ్లకు ఏళ్లుగా ఇక్కడ స్టార్ డమ్ కంటిన్యూ చేశారు. ఇక కొందరు వెటరన్ హీరోయిన్లు రకరకాల కారణాలతో ఇప్పటికి పెళ్లి చేసుకోకుండా అలాగే జీవితం కొనసాగించేస్తున్నారు.
నగ్మా, టబు లాంటి వాళ్లు ఒకప్పుడు స్టార్, క్రేజీ హీరోయిన్లు.. వాళ్లు ఇప్పటకీ పెళ్లికి దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఈ లిస్టులోనే ఉన్నారు మరో సీనియర్ హీరోయిన్ కౌశల్య. సీనియర్ హీరో జగపతిబాబు హీరోగా నటించిన అల్లుడుగారు వచ్చారు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది మలయాళ వెటరన్ హీరోయిన్ కౌసల్య. కర్నాకటలోని బెంగళూరులో పుట్టిన కౌశల్య.. తన సొంత భాష అయిన మళయాళం సినిమాతో సినిమాల్లోకి వచ్చింది.
ఆమె సినిమాల్లోకి వచ్చే టైంకే ఆమె ఫ్యామిలీ వెల్ సెటిల్. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో ఆమెకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆమెలో ఉన్న నటనా ప్రతిభను గుర్తించిన కౌశల్య తండ్రిని ఆమెను నటన వైపు ప్రోత్సహించడంతో సినిమా అవకాశాలు త్వరగానే వచ్చాయి. శ్రీకాంత్ పక్కన ఆమె నటించిన పంచదార చిలక సినిమా హిట్ అయ్యింది. తెలుగులో హీరోయిన్‌గా ఆమె 8కు పైగా సినిమాలు చేసింది.
మంచి కథా బలం, దర్శకులతోనే ఎక్కువ సినిమాలు చేసిన కౌశల్య.. తన కెరీర్‌లో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతోనే ఆమె పెళ్లికి దూరమైందట. ఆమె మళయాళంలో నటిస్తోన్న సమయంలో ఓ ప్రముఖ హీరోతో ప్రేమలో పడిందట. అయితే ఆ హీరో తల్లిదండ్రులు వారి ప్రేమను ఒప్పుకోలేదు. దీంతో సదరు హీరో మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఆ హీరో బ్రేకప్ చెప్పడంతో కౌశల్య పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది. అయితే కౌశల్య ఇటీవల తల్లి, అత్త పాత్రలతో సెకండ్ ఇన్సింగ్స్‌లో ఎంట్రీ ఇచ్చింది.