పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – దగ్గుబాటి రానా కాంబినేషన్లో సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 25న థియేటర్లలోకి రానుంది. మళయాళంలో హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్‌కు రీమేక్‌గా ఈ భీమ్లానాయక్ తెరకెకకింది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు.
ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు సంభాషణలు సమకూర్చడంతో పాటు కథలో మార్పులు, చేర్పులు చేయడం విశేషం. ఈ సినిమాకు త్రివిక్రమ్ హ్యాండ్ పడడంతో పాటు వకీల్‌సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తోన్న సినిమా కావడం, అటు రానా కూడా ఉండడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా భారీ ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ డీటైల్స్ ఇలా ఉన్నాయి.
నైజాం – 35 కోట్లు
సీడెడ్ – 17 కోట్లు
ఉత్తరాంధ్ర – 9.50 కోట్లు
ఈస్ట్ – 6.50 కోట్లు
వెస్ట్ – 5.60 కోట్లు
గుంటూరు – 7.20 కోట్లు
కృష్ణా – 6.00 కోట్లు
నెల్లూరు – 3.20 కోట్లు
————————————
ఏపీ + తెలంగాణ = 90 కోట్లు
————————————
రెస్ట్ ఆఫ్ ఇండియా – 10.50 కోట్లు
ఓవర్సీస్ – 9.00 కోట్లు
——————————–
వరల్డ్ వైడ్ = 109.50 కోట్లు
———————————
భీమ్లా నాయక్ సినిమాకు రు.109.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రు. 110 కోట్ల షేర్ రావాలి.. అంటే రు. 170 – 180 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టాలి. సినిమాకు హిట్ టాక్ వస్తే ఈ టార్గెట్ పెద్ద కష్టం కాదు.. అదే టాక్ తేడా వస్తే మాత్రం పవన్ టార్గెట్ పెద్దదే అవుతుంది.