నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్‌లోనే ఫుల్‌స్వింగ్‌లో ఉన్నాడు. ఆరు పదుల వయస్సు దాటేసినా కూడా బాలయ్యకు అఖండ సినిమా మాంచి ఎనర్జీ ఇచ్చింది. అఖండ తర్వాత మలినేని గోపీచంద్, అనిల్ రావిపూడి ఇలా వరుస లైనప్‌లతో దూసుకుపోతున్నాడు. అటు ఆహాలో అన్‌స్టాపబుల్ బ్లాక్‌బస్టర్.. జూలై నుంచి సెకండ్ సీజన్ అంటున్నారు. ఇక బాలయ్య – వసుంధర దంపతులకు ఇద్దరు కుమార్తెలతో పాటు కుమారుడు ఉన్నారు. కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని చంద్రబాబు తనయుడు లోకేష్‌తో పాటు అటు విశాఖ ఎంవీవీఎస్ మూర్తిగారి మనవడు మొతుకుమిల్లి శ్రీ భరత్ ఇద్దరు భర్తలుగా వచ్చారు. ఈ సంబంధాలు వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. తనయుడు మోక్షజ్ఞ వెండితెర హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకకు రెడీ అవుతున్నాడు.
ఈ డిసెంబర్ 8వ తేదీతో బాలయ్య పెళ్లికి నాలుగు దశాబ్దాలు పూర్తవుతాయి. డిసెంబర్ 8, 1982లో బాలయ్య – వసుంధర దంపతుల పెళ్లి జరిగింది. తాజాగా బాలయ్య పెళ్లి శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శుభలేఖ నవంబర్ 22వ తేదీన ప్రచురణకు వెళ్లినట్టు డేట్ పేర్కొన్నారు. ఈ శుభలేఖ పెళ్లికుమార్తె అయిన వసుంధర ఫ్యామిలీ వాళ్లు వేయించింది కావడం విశేషం. కాకినాడ వాస్తవ్యులు దేవరపల్లి సూర్యారావు – దేవరపల్లి ప్రమీలారాణి దంపతుల ద్వితీయ కుమార్తెను భాగ్యనగరం వాస్తవ్యులు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి పంచమ పుత్రుడికి ఇచ్చి వివాహం చేస్తున్నట్టు తెలిపారు.
ఇక ప్రమీలారాణి- సూర్యారావు దంపతులకు వసుంధర ద్వితీయ కుమార్తెగా పేర్కొన్నారు. ఇక 8వ తేదీ పగలు 12.41 నిమిషాలకు ముహూర్తం. దీనిని బట్టి బాలయ్య పెళ్లి పగలు జరిగిందని అర్థమవుతోంది. పెళ్లి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కర్నాటక కళ్యాణ మండపంలో జరిగింది. పెళ్లి జరిగి 40 ఏళ్లు కావొస్తున్నా దీనిని మంచి జ్ఞాపకంగా దాచుకున్నారు. అది బయటకు రావడంతో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక వసుంధర తండ్రి సూర్యారావు శ్రీరామదాసు మోటార్ ట్రాన్స్‌పోర్ట్ అధినేత. సూర్యారావు సోదరుడు ఎస్ఆర్ఎంటీ చౌదరి కూడా ఎస్ఆర్ఎంటీ ట్రాన్స్‌పోర్ట్ అధినేత.
ఇక బాలయ్యకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నప్పటికే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండడంతో పెళ్లి సంబంధాలు చూసే బాధ్యత అప్పటి ఎన్టీఆర్ బెస్ట్‌ఫ్రెండ్, ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావుకు అప్పగించారు. ఆయన ద్వారానే బాలయ్యకు వసుంధర సంబంధం ఫిక్స్ అయ్యింది. పెళ్లి చూపుల్లోనే బాలయ్య వసుంధరను ఓకే చేశారు. ఇక బాలయ్య హీరోగా ఉండడంతో తనకు కాబోయే కోడలు సినిమా రంగంతో సంబంధం లేని.. సాంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయి అయ్యి ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకే మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న కుటుంబానికి చెందిన వసుంధరను ఆయన సెలక్ట్ చేసుకున్నారు.
వసుంధర అంటే ఎన్టీఆర్‌కు ఎంతో ఇష్టం. బాలయ్యను ఆమె ఎప్పుడూ ప్రేమతో చూసుకోవడం ఎన్టీఆర్‌కు బాగా నచ్చేది. ఇక పెళ్లయ్యాక వసుంధర అప్పుడప్పుడు బాలయ్యపై ఎన్టీఆర్‌కు సరదాగా కంప్లైంట్లు కూడా చేసేవారట. ఇక బాలయ్య – వసుంధర పెళ్లికి కూడా ఎన్టీఆర్ వెళ్లలేదు. అప్పటికే ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఎన్టీఆర్ అటు వైపే వెళ్లలేదు. నాదెండ్ల పెళ్లికి వెళ్లకపోతే బాగోదు.. వెళ్లి అక్షింతలు వేసి భోజనం చేసి వద్దామని చెప్పినా ఎన్టీఆర్‌కు అప్పటికే కమిట్‌మెంట్స్, సమావేశాలు ఎక్కువుగా ఉండడంతో.. వాటిని క్యాన్సిల్ చేయడం ఇష్టంలేక వెళ్లలేకపోయారు. ఇక బాలయ్యకు అప్పట్లోనే అత్తింటివారి నుంచి రు. 10 లక్షల నగదు కట్నంగా వచ్చింది..!