ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో ఓ సినిమా హిట్ అవ్వాలంటే ఎన్నో పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఓ వైపు కరోనా కష్టాలు, మరోవైపు ఏపీలో టిక్కెట్ రేట్ల సమస్య ఇలా చాలా ఇబ్బందులే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటోంది. గత యేడాది కాలంగా ఈ ఇబ్బందులు తప్పడం లేదు. అందుకే తెలుగు సినిమా వసూళ్లు కూడా తక్కువుగా కనిపిస్తున్నాయి. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా బాలయ్య అఖండ, బన్నీ పుష్ప సినిమాలు తిరుగులేని బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాయి. అఖండ అయితే ఊపేసింది.. అఖండ గర్జన చేసేసింది. బాలయ్య కెరీర్‌లో రు. 100 కోట్ల సినిమా ఇప్పటి వరకు లేదు.. అలాంటిది ఏకంగా రు. 150 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టేసింది. ఓవరాల్‌గా ఈ సినిమాకు రు. 200 కోట్ల వసూళ్లు వచ్చాయి.
ఇక బన్నీ పుష్ప సినిమా అయితే వరల్డ్ వైడ్‌గా రు. 365 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. ఇక బన్నీని పక్కన పెట్టేస్తే బాలయ్యపై అఖండ ముందు వరకు సోషల్ మీడియాలో విమర్శలు ఎక్కువుగా ఉండేవి. అంతకుముందు బాలయ్య వరుస ప్లాపులతో ఉన్నారు. అలాంటిది అఖండ సినిమాతో ఇన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని కూడా ఏకంగా థియేట్రకల్ షేర్ ద్వారానే రు. 150 కోట్లు రాబట్టాడు. ఇది మామూలు విషయం కాదు. ఈ వసూళ్లు చూసి ప్రతి ఒక్కరు ముక్కున వేలేసుకుంటున్నారు.
ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కు కెరీర్‌లోనే చాలా పెద్ద అగ్నిపరీక్ష భీమ్లానాయక్ సినిమాతో ఎదుర్కొంటున్నారు. పవన్ కెరీర్‌లో రు. 100 కోట్ల సినిమా లేదు. ఇప్పటకీ 2013లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాను చూపించే పవన్ సినిమాలకు బిజినెస్ చేసుకోవాల్సిన దుస్థితి. ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా పవన్ రేంజ్‌కు తగ్గ హిట్ బొమ్మలు కావడం లేదు. నిజానికి పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో పవన్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం మధ్య పెద్ద అగాథాన్నే పెంచాయి. అయితే సినిమాలో దమ్ముంటే ప్రేక్షకులను థియేటర్లకు రాకుండా ఎవ్వరూ ఆపలేరు.
మహేష్‌బాబు, బన్నీ, ఎన్టీఆర్, రామ్‌చరణ్ లాంటి హీరోలు కూడా తమ యావరేజ్ సినిమాలతో రు. 100 కోట్లు మంచి నీళ్లు తాగినంత సులువుగా కొట్టేస్తున్నారు. వీళ్లంతా పాన్ ఇండియా రేంజ్‌లోకి దూసుకుపోతున్నారు. పైగా వరుస హిట్లు కొడుతున్నారు. అయితే పవన్ మాత్రం ఓ వైపు వరుస ప్లాపులతో పాటు రు. 100 కోట్లు, రు. 150 కోట్ల మొఖమే చూడడం లేదు. ఈ విమర్శలకు చెక్ పెట్టి తన స్టామినా ఏంటో ఫ్రూవ్ చేసుకునేందుకు భీమ్లానాయక్ మంచి ఛాన్స్. ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్ కొడితేనే పవన్ నెక్ట్స్ సినిమాలపై ఆసక్తి ఏర్పడుతుంది. ఆయనకు రాజకీయంగా ప్లస్ అవుతుంది. ఏదేమైనా ఈ సినిమా హిట్ అవ్వడమే కాదు.. రు. 150 – 200 కోట్ల రేంజ్ వసూళ్లు వస్తేనే పవన్ స్టామినా ఫ్రూవ్ అవుతుంది. మరి పవన్ ఏం చేస్తాడో ? చూడాలి.