Moviesఆ బడా నిర్మాత ఇంట్లో వెంకటేష్ బ్యూటీ ..రాఘవేంద్ర రావుకే షాకిచ్చిన...

ఆ బడా నిర్మాత ఇంట్లో వెంకటేష్ బ్యూటీ ..రాఘవేంద్ర రావుకే షాకిచ్చిన ఈ హీరోయిన్..!!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రావలి అన్నా..వచ్చిన ఆ అవకాశాని ఉపయోగించుకోవాలి అన్నా బోలెడంత లక్ ఉండాలి. అలాంటి అదృష్టం చాలా తక్కువ మంది హీరోయిన్లకే దక్కుతుంది. అలాంటి వారిలో ఈ అపర్ణ కూడా ఒకరు. నిజానికి అమ్మడు చేసింది చాలా తక్కువ సినిమాలే..కానీ, ఆమెను జనాలు ఇంకా గుర్తుపెట్టుకున్నారు అంటే ఆమె నటన వాళ్ళకు ఎంత నచ్చిందో మనం అర్ధం చేసుకోవచ్చు. చక్కటి రూపం..చూడగానే ఆకర్షించే అందం..ఎప్పు స్మైల్ తో పలకరించే విధానం..అమ్మడుకి బాగా ప్లస్ పాయింట్ లు గా మారాయి .

అయితే ఏన్ని ఉన్నా ఏం లాభం సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగలేకపోయింది. వెంకటేష్ పక్కన నటించినా ఈ అమ్మడు తన చేతులారా తన సినీ కెరీర్ ను నాశనం చేసుకుంది. 1992లో వెంకటేశ్ – మీనా జంటగా గా తెరకెక్కిన సుందరకాండ సినిమా గుర్తుంది కదా..హా అయినా ఆ సినిమాని ఎలా మర్చిపోగలం..అందరు వాళ్ల పాత్రలకు తగ్గట్లు న్యాయం చేసారు. ఫైనల్ గా రిజల్ట్ అందరిని సంతోషపరిచింది.

 

ఇక ఈ సినిమాలో అపర్ణ కీలక పాత్రలో నటించారు. మాస్ ఇమేజ్ సినిమాలు వెంకీ ఈ సినిమాలో కాలెజీ లెఖ్చరర్ పాత్రలో కనిపించిగా..అతని ఆటపట్టించే అమ్మాయి గా అపర్ణ బాగా నటించింది. ఈ పాత్రకు రాఘవేంద్ర రావు ఎంతో మంది హీరోయిన్లని చూసారట..కానీ సెట్ అవ్వలేదు. ఫైనల్ గా కొత్త వాళ్ళను తీసుకుందాం అని ట్రై చేస్తున్నప్పుడు అపర్ణ ని ఓ బడా నిర్మాత ఇంట్లో చూసాడు. చూడగానే ఆయన అనుకున్న పాత్రకి ఈమె కరెక్ట్ అనుకున్నాడు. కానీ ఇంత పెద్ద ఇంట్లో ఉంటుంది. మన సినిమాలో నటిస్తుందో లేదో అనుకుని సైలెంట్ అయిపోయాడు.

సీన్ కట్ చేస్తే.. వారం రోజుల తరువాత సుందరకాండ సినిమాకి జరుగుతున్న ఆడిషన్స్ లో ప్రత్యేక్సమైంది. వెంటనే ఆమె గురించి డీటైల్స్ కనుకున్నాడు. అసలు మ్యాటర్ తెలిసి షాక్ అయ్యాడు. అమ్మడు నిర్మాత కె.వి.వి,సత్యనారాయణ మేనకోడలు అని తెలుస్కుని ఆశ్చర్యపోయాడు. ఇక ఆలస్య లేకుండా ఆమె ను స్టూడెంట్ రోల్ కి ఫైనల్ చేసి..చక చకా షూటింగ్ కంప్లీట్ చేసారు. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో అమ్మడుకి మంచి మ్మచి అవకాశాలు వచ్చాయి. కానీ, అప్పడు వాటిని రిజెక్ట్ చేసి..2002 లో పెళ్లి చేసుకుని భర్తతో హ్యాపీగా అమెరికాలో సెటిల్ అయిపోయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news