అఖండ తర్వాత బాలయ్య మామూలు లైనప్‌తో వెళ్లడం లేదు. ప్రస్తుతం మలినేని గోపీచంద్ సినిమా చేస్తూనే మరోవైపు అనిల్ రావిపూడి సినిమాను కూడా లైన్లో పెట్టేశాడు. అనిల్ రావిపూడి – బాలయ్య సినిమాపై బాలయ్యే స్వయంగా అన్‌స్టాపబుల్ షోలో క్లారిటీ ఇచ్చేశాడు. ఇక ఇప్పుడు మరో మాస్ డైరెక్టర్ బాలయ్యతో సినిమాకు రెడీ అవుతున్నాడు. మాస్ డైరెక్టర్ సంపత్ నంది బాలయ్యతో సినిమా చేసేందుకు గత కొద్ది రోజులుగా విశ్వప్రయత్నాలు చేస్తూనే వస్తున్నాడు.
గౌతమ్‌నందా, రచ్చ లాంటి మాస్ సబ్జెక్టులను సంపత్‌నంది బాగా హ్యాండిల్ చేశాడు. సంపత్ నంది కథల్లో మరీ అంత కొత్తదనం ఉండదు.. ట్రీట్మెంట్ లో కూడా ఏదో సంచలనాలు ఆశించలేం. అయితే మాస్ పల్స్ బాగా తెలిసిన వాడు. బాలయ్య ఇమేజ్‌కు తగినట్టుగా.. ఆయన అభిమానులను, మాస్ జనాలను శాటిస్ఫై చేసే ట్రిక్ మనోడి దగ్గర ఉంది. అందుకే బాలయ్యతో సినిమా చేసి సత్తా చాటుకోవాలని కొద్ది రోజులుగా ట్రై చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే బాలయ్యకి సంపత్ నంది ఓ కథ చెప్పాడని బాలయ్య కథ నచ్చి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న రూమర్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ సినిమా నిర్మాత సీ కళ్యాణ్ బ్యానర్లో ఉంటుందని తెలుస్తోంది. గతంలో ఇదే బ్యానర్లో బాలయ్య పరమవీరచక్ర, జై సింహా, రూలర్ సినిమాలు చేశాడు. రూలర్ తర్వాత మరోసారి సీ కళ్యాణ్‌కు సినిమా చేసినట్టు అవుతుంది.
అఖండ నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి, సీ కళ్యాణే స్వయంగా సంపత్‌నందిని బాలయ్య దగ్గరకు పంపారట. బాలయ్య ఇమేజ్‌కు తగినట్టుగానే సంపత్ నంది కథను రెడీ చేసుకున్నాడని తెలుస్తోంది. మధ్యలో ఓ సారి రవితేజతో సంపత్ సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే తాను రాసుకున్న కథకు బాలయ్య అయితేనే న్యాయం చేస్తాడని భావించి.. బాలయ్య డేట్స్ కోసమే వెయిట్ చేస్తున్నాడని అంటున్నారు. బాలయ్య ఓకే చెప్పాడంటే సంపత్‌నందికి ఇది గోల్డెన్ ఛాన్సే అవుతుంది.