బుల్లితెరపై అనసూయ ఎంత చిట్టిపొట్టి డ్రెస్సులు వేసుకున్నా చాలా గ్లామర్‌గా కనిపిస్తుంది. ఇద్దరు పిల్లల తల్లి అయినా ఫార్టీల్లో ఉన్నా కూడా అనసూయ అందం ఈ తరం యూత్‌కు కూడా మాంచి కిక్ ఇస్తుంది. అససూయ చీరకట్టులో అయినా, మోడ్రన్ డ్రెస్సుల్లో అయినా కూడా చూపంతా తనమీదే ఉండేలా చూసుకుంటుంది. ఇక మోకాళ్లు కనపడేలా స్కర్ట్స్ వేసుకున్నా ఆమె కేక పెట్టించేలా ఉంటుంది.
అసలు బుల్లితెరపై ఇన్నేళ్ల తెలుగు యాంకర్ల చరిత్రలో ఎంతో మంది వచ్చారు.. వెళ్లారు. అయితే యాంకర్‌కు కూడా హిట్ ఇమేజ్ తేవడంలోనూ, యాంకర్ అన్న పదానికి గ్లామరసం అద్దడంలోనూ అనసూయే ఆరాధ్యురాలు. బుల్లితెర యాంకర్లను కూడా ప్రేక్షకులు ఇంతలా ఆరాధిస్తారా ? అన్నది కూడా అనసూయ నుంచే ట్రెండ్ స్టార్ట్ అయ్యింది.
ఇక బుల్లితెర పై నుంచి వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చాక కూడా అనసూయ ఏ పాత్ర వేసినా ప్రేక్షకులకు భలే కనెక్ట్ అయిపోయింది. సాయిధరమ్ తేజ్ విన్నర్ సినిమాలో స్పెషల్ ఐటెం సాంగ్ చేసినా, రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా సెంటిమెంట్ పండించినా, పుష్ప సినిమాలో దాక్షాయణిగా లేడీ విలన్‌గా చేసినా, క్షణం లాంటి థ్రిల్లర్ సినిమా చేసినా అనసూయ ఆ పాత్రలో అలా ఒదిగిపోయింది.
అయితే తాజాగా వచ్చిన రవితేజ ఖిలాడి సినిమాలో ఆమె డ్రెస్సు చూసిన వారు బాబోయ్ అనసూయ అని లబోదిబోమంటున్నారు. దర్శకుడు రమేష్‌వర్మ అనసూయను చూపించడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయాడు. ఫస్టాఫ్‌లో హీరోయిన్ను పూర్తిగా చీరకట్టులో చూపిస్తాడు.. సెకండాఫ్‌కు వచ్చేసరికి హీరోయిన్లలో డింపుల్ హయతి అయితే ఓ ఐటెం గర్ల్ కంటే ఇంకా తక్కువ స్థాయికి దిగజారి డ్రెస్సులు వేసుకుంది.
అనసూయ డ్రెస్సు చూస్తే ఇంత దారుణమా ? అన్నట్టుగా ఆమె డ్రెస్సులు ఉన్నాయి. ఎవరి శరీరాలకు ఎలాంటి దుస్తులు నొప్పుతాయో ? కూడా మినిమంగా తెలియనట్టుగా డ్రెస్సుల సెలక్షన్ ఉంది. ఈ విషయంలో డిజైనర్ వైఫల్యం కూడా స్పష్టంగా కనిపించింది.