బాలీవుడ్ బిగ్ బీ అమితాబచ్చన్ ఈ వయస్సులో కూడా ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నాడు. అమితాబ్ ఓ సినిమాలో నటించాడు అంటే ఆయన అభిమానులు తొలి రోజు తొలి షో చూసి సినిమాను ఎంజాయ్ చేయాల్సిందే. ఈ వయస్సులో కూడా అమితాబ్ ఇంత యాక్టివ్‌గా ఉంటూ యంగ్ హీరోలకు ఆదర్శంగా ఉంటున్నాడు. అమితాబ్ తెలుగులో కూడా మెగాస్టార్ చిరంజీవి నటించిన 151వ సినిమా సైరా నరసింహారెడ్డిలో ఆయన గురువుగా ఓ కీలక పాత్రలో నటించాడు. ఆయనకు తెలుగు గడ్డపై కూడా అభిమానులు ఎక్కువగానే ఉన్నారు.
ప్రస్తుతం అమితాబ్ అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ ఉండడంతో పాటు తన ఫ్యామిలీ లైఫ్ కూడా ఎంజాయ్ చేస్తూ వస్తున్నాడు. అమితాబ్ ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్ పతి ప్రాజెక్టుకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే తెలుగులో కూడా ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ (మహానటి ఫేం) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రాజెక్ట్ కేలో కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా వైజయంతీ మూవీస్ అధినేత చలసాని అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
తాజాగా అమితాబ్ తన పాత ఇంటిని అమ్మేశారు. 1980కు ముందు ఆయన స్టార్ హీరోగా కొనసాగుతోన్న రోజుల్లో కొనుక్కున్న ఇంటిని ఆయన ఇప్పుడు సేల్ చేసేశారట. ఇది ప్రస్తుతం పాత బడిపోవడంతో పాటు శిథిలావస్థకు చేరుకోవడంతో రు. 23 కోట్ల భారీ రేటుకు అమ్మేసినట్టు తెలుస్తోంది. ఈ భవనం సౌత్ ఢిల్లీలో ఉంది. ఇది అమితాబ్ తల్లి పేరున రిజిస్టర్ అయ్యింది. దీని పేరు సోపాన్. రెండతస్తుల్లో ఉండే ఈ భవనంలో అమితాబ్ చాలా రోజులు తన తల్లిదండ్రులతో కలసి ఉన్నారు.
ప్రస్తుతం ఈ భవనంలో ఎవ్వరూ ఉండడం లేదు. 418 స్క్వేర్ ఫీట్స్‌లో ఈ భవనం ఉందని తెలుస్తోంది. అన్నీ బదేర్ అనే వ్యక్తి అమితాబ్ నుంచి ఈ భవనం కొన్నారు. ఆయన ఆ భవనాన్ని కూల్చివేసి ఆయన టేస్ట్‌కు అనుగుణంగా మరో కొత్త భవనం నిర్మించుకుంటారట.