నందమూరి నటసింహం బాలయ్య ఏ ముహూర్తాన అఖండ సినిమా స్టార్ట్ చేశాడో కాని.. రెండు సంవత్సరాల పాటు థియేటర్లలోకి వచ్చే విషయంలో చాలా డిలే అయ్యింది. ఇక అఖండ గతేడాది డిసెంబర్ 2న రిలీజ్ అయ్యింది. తొలి ఆటకే బాలయ్య నట విశ్వరూపం చూపించేశాడ్రా బాబు అన్న టాక్ రావడంతో అప్పటి నుంచి సంక్రాంతి వరకు థియేటర్లలో గర్జన మోగించేసి.. ఓ ఊపు ఊపేసింది. బాలయ్య ఏంటి ఈ వయస్సులో ఈ నటన ఏంట్రా అని జనాలు వెర్రెత్తిపోయారు. అసలు కరోనా సెకండ్ వేవ్ తర్వాత జనాలు థియేటర్లకు వచ్చే విషయంలో డైలమాలో ఉన్నారు.
అయితే అఖండ అవన్నీ పటాపంచలు చేసి పడేసింది. రు. 150 కోట్ల థియేట్రికల్ షేర్.. ఓవరాల్‌గా రు. 200 కోట్ల వసూళ్లు.. రు. 57 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేస్తే రు. 80 కోట్ల షేర్ ఇది ఓవరాల్‌గా అఖండ దెబ్బకు పేలిపోయిన రికార్డులు. ఇక ఈ రోజుల్లో అసలు 50 రోజుల పోస్టర్ చూడడమే గగనం. అలాంటిది అఖండ ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే షిఫ్ట్‌లతో కలుపుకుని 103 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. వరల్డ్ వైడ్ గా చూస్తే 106 కేంద్రాల్లో అర్థ శతదినోత్సవం జరుపుకుంది.
ఇప్పటకీ ఏపీలోనే 4 సెంటర్లలో 100 రోజుల వైపు పరుగులు పెడుతోంది. అందులో ఒక్క కర్నూలు జిల్లాలోనే ఎమ్మిగనూరు – ఆదోనీ – కోయిలకుంట్లతో పాటు గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట కేంద్రాలు ఉన్నాయి. ఇక అఖండను డిస్నీ + హాస్ట్ స్టార్‌లో రిలీజ్ చేస్తే 24 గంటల్లోనే ఏ తెలుగు సినిమాకు రానన్ని క్లిక్స్‌తో మరో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. వెండితెరా లేదు. బుల్లితెరా లేదు.. చివరకు వీథి తెరపై కూడా అఖండ మానియా కొనసాగుతోంది. ఇటు గుంటూరు, ప్రకాశం నుంచి అటు ఖమ్మం జిల్లా వరకు ఏ పండగ వచ్చినా కూడా వీథి తెరపై పెద్ద గ్రౌండ్స్‌లో అఖండ సినిమాను ఊరంతా కలిసి వచ్చి మరి చూస్తున్నారు.
అఖండ సినిమాను ఓ పండగలా ఇప్పటకీ సెలబ్రేట్ చేసుకోవడం ఆశ్చర్యమే. ఇదిలా ఉంటే ఇప్పుడు అఖండ ఖ్యాతి విదేశాలకూ పాకేసింది. తాజాగా అఖండ జపాన్‌లో రిలీజ్ చేస్తున్నారు. జపాన్ ప్రేక్షకుల డిమాండ్ మేరకు ఈ నెల 27న అక్కడ రిలీజ్ చేస్తున్నారు. జపాన్‌లోని టోక్యోలో ఈ నెల 27న అఖండ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే భారీ ఎత్తున టిక్కెట్లు బుక్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో బాహుబలి సినిమా తర్వాత ఆ రేంజ్లో ఎక్కువ స్పెషల్ షోలు పడిన తెలుగు సినిమాగా అఖండ అక్కడ రికార్డులకు ఎక్కేసింది. ఏదేమైనా ఇప్పట్లో అఖండ మానియాకు బ్రేకులు పడేలా కనపడడం లేదు.