యువరత్న నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ అఖండ ఇంకా బాక్సాఫీస్ దగ్గర రన్ అవుతోంది. ఓవరాల్‌గా థియేట్రికల్ షేర్ ద్వారా ఈ సినిమా రు. 150 కోట్లు కొల్లగొట్టింది. నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా కలుపుకుంటే అఖండకు రు. 200 కోట్ల వసూళ్లు వచ్చాయి. అది కూడా ఏపీలో టిక్కెట్ రేట్లు తక్కువుగా ఉన్న టైంలో వచ్చిన వసూళ్లు ఇవి. వాస్తవంగా బాలయ్యకు నైజాం కంటే ఏపీ, సీడెడ్‌లోనే ఫ్యాన్ బేస్ ఎక్కువ. ఈ రెండు ప్రాంతాల్లో అఖండను జనాలు విరగబడి మరీ చూశారు. ఇక నైజాంలో అఖండ ఏకంగా రు. 20 కోట్లు వసూలు చేసింది.
ఏపీలో కూడా టిక్కెట్ రేట్లు మామూలుగా ఉండి ఉంటే అఖండ మరో రు. 25 కోట్ల వసూళ్లు సులువుగా రాబట్టేదని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఇంకా అఖండ బాక్సాఫీస్ దగ్గర శతదినోత్సవం దిశగా దూసుకు వెళుతోంది. ఏపీలో ఈ సినిమా మొత్తం 4 సెంటర్లలో 80 రోజులు దాటేసి శతదినోత్సవం వైపు వెళుతోంది. మొత్తం నాలుగు సెంటర్లలో సినిమా నడుస్తుండగా.. అందులో మూడ సీడెడ్.. అది కూడా కర్నూలు జిల్లాలోనే నడుస్తున్నాయి. మరొకటి మాత్రం గుంటూరు జిల్లా చిలకలూరిపేట.
కర్నూలు జిల్లా ఆదోని – రాజ్, ఎమ్మిగనూరు – శ్రీనివాస, కోయిలకుంట్ల – ఏవీఆర్ థియేటర్లతో పాటు చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్లలో అఖండ 100 రోజుల దిశగా దూసుకుపోతోంది. ఏదేమైనా కర్నూలు జిల్లా బాలయ్య అడ్డా అన్న విషయం మరోసారి ఫ్రూవ్ అయ్యింది. గతంలో ఇదే జిల్లాలోని ఎమ్మిగనూరులోనే బాలయ్య లెజెండ్ ఏకంగా 400కు పైగా రోజుల పాటు ఆడి రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక అఖండ ఏపీ, తెలంగాణలో 103 కేంద్రాల్లో 50 రోజుల పండగ జరుపుకుంది. ఓవరాల్‌గా ఈ సినిమా 106 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. ఇక చిలకలూరిపేట ఎప్పుడూ నందమూరి ఫ్యామిలీ సినిమాలకు అడ్డా.. అక్కడ బాలయ్య ప్లాప్ సినిమా లయన్‌తో పాటు కళ్యాణ్‌రామ్ బ్లాక్‌బస్టర్ పటాస్ సినిమాలు కూడా సెంచరీ కొట్టేశాయి.
ఇక బాలయ్య ప్రస్తుతం మలినేని గోపీచంద్ దర్శకత్వం వహిస్తోన్న సినిమాలో నటిస్తున్నాడు. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ దుమ్ము రేపేసింది. శృతీహాసన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు.