Movies21 ఏళ్ళు తరువాత మళ్ళీ అలా..‘ఖుషి’ మూవీ పాటకు డ్యాన్స్ చేసిన...

21 ఏళ్ళు తరువాత మళ్ళీ అలా..‘ఖుషి’ మూవీ పాటకు డ్యాన్స్ చేసిన భూమిక(వీడియో)..!!

పవన్ కల్యాణ్ .. భూమిక హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఖుషి’ . అప్పట్లో ఈ సినిమా యూత్ ను ఒక ఊపు ఊపేసింది. 2001, ఎప్రిల్ 27న విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఎస్.జె. సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, ఎ.ఎమ్. రత్నం నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ కే బిగ్గేస్ట్ టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఇటు భూమిక కెరియర్లోను ఈ సినిమా కీలక రోల్ ప్లే చేసింది. నిజం చెప్పాలంటే ఈ సినిమా తరువాతే ఇద్దరు కూడా స్టార్ డమ్ పరంగా రెండు మెట్లు పైకి ఎక్కారు.

ఈ సినిమా అంటే నచ్చని వారంటూ ఉండరు. ఇప్పటికి ఈ సినిమా టీవీలో వస్తే ఎంజాయ్ చేసే వాళ్ళు మనలో చాలా మంది ఉన్నారు. ఇక ఆ నడుము సీన్ అయితే సినిమా మొత్తానికి హైలెట్ గా నిలిచింది. ఆ సీన్స్ ని యూట్యూబ్ లో ఇప్పటికి చూసి నవ్వుకుంటుంటారు. దీనిని బట్టి ఈ సినిమా ఎంతగా ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు.

తమిళంలో విడుదలై సూపర్ హిట్ అయిన ‘ఖుషి’ మూవీని అదే పేరుతో తెలుగులో సైలెంట్ గా రీమేక్ చేసారు. ఈ సినిమకి సంగీత దర్శకుడిగా మణిశర్మ పని చేశారు. ఇక ఈ సినిమాలోని ప్రతి పాట హైలెట్ గా నిలిచింది. ముఖ్యంగా అమ్మాయే సన్నగా అంటూ వచ్చే పాట అయితే ప్రేక్షకులను ఓ ఊపు ఊపేసింది. అప్పట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఈ పాట ప్లే అవ్వాల్సిందే. అంతలా ఆకట్టుకుంది.

అయితే ఇదే పాటను భూమిక సరిగ్గా 21 ఏళ్ల తరువాత రీక్రియేట్ చేసింది. అప్పుడు ఎలా ఈ పాటకు డ్యాన్స్ చేసిందో అలానే ఇప్పుడు అలాంటి ఎక్స్ ప్రేషన్స్ తో డ్యాన్స్ చేసి..ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో పవన్ అభిమానులు మళ్ళీ ఈ సినిమాకి సీక్వెల్ వస్తే బాగుండని..పవన్ కల్యాణ్-భూమిక కలిసి నటిస్తే చూడాలని కోరుకుంటున్నారు. మరి చూడాలి వాళ్ళ కోరిక ఎప్పటికి నెరవేరుతుందో..?

 

 

View this post on Instagram

 

A post shared by Bhumika Chawla (@bhumika_chawla_t)

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news