అవసరాల శ్రీనివాస్ ఈ పేరు తెలుగు సినిమా వాళ్లకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటుడిగాను.. దర్శకుడిగాను.. క్యారెక్టర్ ఆర్టిస్టుగాను ఇలా ఆల్‌రౌండర్‌గా అన్ని పాత్రల్లోనూ మెప్పిస్తూ వస్తున్నాడు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన అవసరాల శ్రీనివాస్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేశాడు. అయితే నటనపై ఉన్న ఇష్టంతో సినిమాల్లోకి వచ్చాడు. 2008లో వచ్చిన అష్టాచెమ్మా సినిమాతో తొలిసారి నటుడిగా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.
ఆ తర్వాత కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. రచయితగా ఇలా పలు అవతారాలు మారిన అవసరాల ఆ తర్వాత డైరెక్టర్ అయ్యాడు. ఊహలు గుసగుసలాడే, జో అచ్యుతానంద సినిమాలతో దర్శకుడిగా కూడా తానేంటో ఫ్రూవ్ చేసుకున్నాడు. అవసరాల వయస్సు ఇప్పటికే 40 ఏళ్లకు చేరువ అవుతోంది. ఇప్పటకి మనోడు పెళ్లి చేసుకోకుండానే బ్యాచిలర్ అయ్యాడు. అసలు పెళ్లి ఊసే ఎత్తడం లేదు.
మీ పెళ్లి ఎప్పుడు అన్న ప్రశ్నకు నా దగ్గర డబ్బుల్లేవ్ అంటూ ఆన్సర్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు మాత్రం తనకు పెళ్లి అవసరం లేదని.. తాను అసలు పెళ్లే చేసుకోనని చెప్పేస్తున్నాడు. తాను పెళ్లి చేసుకోకూడదు అని నిర్ణయం తీసుకున్నానని… ఈ నిర్ణయానికి పెద్ద కారణాలు కూడా లేవని చెప్పేశాడు. పెళ్లి చేసుకోనన్న విషయం చెప్పినప్పుడు కూడా మా నాన్న గారు నా నిర్ణయం పట్ల జలసీ ఫీల్ అయ్యారని.. నా ట్రాక్ ఆయనకు కూడా బాగా నచ్చిందని శ్రీనివాస్ చెప్పుకువచ్చాడు.
పెళ్లి విషయంలో ఇప్పుడు అవసరాల చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక సినిమాల విషయానికి వస్తే అవసరాల ప్రస్తుతం నూటొక్క జిల్లాల అందగాడుతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా కూడా నటనా పరంగా మంచి మార్కులే పడ్డాయి.