Moviesపెళ్లి అంటేనే భ‌య‌ప‌డుతున్న‌ పూర్ణ.. ఎందుకో తెలిస్తే మీరు పాపమంటారు!

పెళ్లి అంటేనే భ‌య‌ప‌డుతున్న‌ పూర్ణ.. ఎందుకో తెలిస్తే మీరు పాపమంటారు!

పూర్ణ‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఆమె అసలు పేరు షామ్నా. కేర‌ళ‌లో జ‌న్మించిన ఈ ముద్దుగుమ్మ డ్యాన్స‌ర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసి.. `మంజు పొలోరు పెంకుట్టి` అనే మ‌ల‌యాళ చిత్రం ద్వారా సినీరంగ ప్ర‌వేశం చేసింది. ఇటు శ్రీ మహాలక్ష్మి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అవును, అవును 2, సీమ టపాకాయ్ చిత్రాల‌తో మంచి న‌టిగా గుర్తింపు ద‌క్కించుకుంది. కానీ, స్టార్ హీరోల సినిమాల్లో మాత్రం అవ‌కాశాలు ద‌క్కించుకోలేక‌పోయింది.

అయితే కెరీర్ డ‌ల్ అవుతున్న స‌మ‌యంలో ప్ర‌ముఖ రియాలిటీ షో `ఢీ`కి జ‌డ్జ్‌గా వ‌చ్చి మ‌ళ్లీ ద‌ర్శ‌కుల కంట్లో ప‌డింది. దీంతో పుర్ణ‌కు వ‌రుస అవ‌కాశాలు త‌లుపు త‌డుతున్నాయి. ఇక ఇటీవ‌ల బ్యాక్‌డోర్‌, అఖండ‌, దృశ్యం 2 చిత్రాల‌తో పాటు 3 రోజెస్ వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన పూర్ణ‌.. వ‌య‌సు ముప్పై దాటినా ఇంకా పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు.

అస‌లు పెళ్లి అంటేనే ఆమె భ‌య‌ప‌డుతుంది. అందుకు కార‌ణం లేక‌పోలేదు. గ‌తంలో ఓ దొంగ ముఠా పూర్ణ తల్లిదండ్రులను సంప్రదించి పెళ్లి సంబంధం మాట్లాడారు. వారి మాయ మాట‌లు న‌మ్మి పూర్ణ‌, ఆమె త‌ల్లిదండ్రులు కూడా వివాహానికి అంగీకరించారు. ఈ క్ర‌మంలోనే త‌న‌కు కాబోయే అబ్బాయితో వివాహం అనంత‌రం జీవితాన్ని ఎలా గడపాలి అనే విషయాన్ని కూడా పూర్ణ చ‌ర్చించుకుంద‌ట‌.

అయితే అంతా స‌వ్యంగా సాగుతున్న స‌మ‌యంలో స‌ద‌రు దొంగ ముఠా గుట్టు ర‌ట్టైంద‌ట‌. సినీ ఇండస్ట్రీలో ఈ వార్త అప్పట్లో సంచలనంగా మారింది. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి.. పూర్ణను మోసం చేసిన ముఠాను జైల్లోకి నెట్టారు. ఇక అప్ప‌టి నుంచీ పెళ్లిపై విర‌క్తి పెంచుకున్న పూర్ణ‌..ఇప్పట్లో నాకు వివాహం వద్దని తల్లిదండ్రులతో చెప్పేసింద‌ట‌.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news