దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రెస్టేజియస్ మూవీ త్రిఫుల్ ఆర్ విషయంలో రోజు రోజుకు టెన్షన్ పెరిగిపోతోంది. గత రెండు సంవత్సరాలుగా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా ? అని కోట్లాది మంది సినీ అభిమానులు ఎంతో ఆతృతతో ఉన్నారు. అయితే సినిమా మాత్రం ప్రతిసారి వాయిదా పడుతూ ఊసూరు మనిపిస్తోంది. ఇక సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతుందని అందరూ అనుకున్నారు.
అయితే ఇప్పుడు పరిస్థితులు ఏ మాత్రం బాగాలేవు. ఓ వైపు దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆంక్షలు విధించేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఉన్న ఆంక్షల నేపథ్యంలో త్రిఫుల్ ఆర్ రిలీజ్ చేస్తే ఏ మాత్రం వర్కవుట్ కాదన్న నిర్ణయానికి సినిమా మేకర్స్ వచ్చేశారట. మహారాష్ట్ర, ఢిల్లీ లాంటి చోట్ల నైట్ కర్ప్యూ అమల్లో ఉంది.
కొన్ని చోట్ల 50 శాతం కెపాసిటీతోనే థియేటర్లు రన్ చేయాలన్న కండీషన్లు వచ్చేశాయి. కేరళలో కూడా కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లు నడుస్తున్నాయి. ఏపీలో ఇప్పటికే టిక్కెట్ రేట్ల పంచాయితీ తెగేలా లేదు. ప్రభుత్వం వేసిన కమిటీ కూడా 11 న సమావేశం కావాలని నిర్ణయం తీసుకుంది. అంటే అప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. ఆ టిక్కెట్ రేట్లతో అమ్మిన రేట్లతో పోలిస్తే కనీసం 50 శాతం అమౌంట్ కూడా వచ్చేలా లేదు.ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను వాయిదా వేయక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. నిర్మాత దానయ్యతో పాటు దర్శకుడు రాజమౌళి రెండు రోజులకే ఒక్కటే చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లకు కోట్లాది రూపాయలు ఖర్చయ్యాయి. సినిమా వాయిదా వేసినా అదంతా నష్టమే అవుతోంది. ఇక సంక్రాంతికి ఒమిక్రాన్ కేసులు తీవ్రమవుతాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో త్రిఫుల్ ఆర్ ఏప్రిల్‌కు వెళ్లిపోవచ్చని టాక్ ? అదే జరిగితే అంతకు మించిన బ్యాడ్ న్యూస్ ఏం ఉండదు.