Moviesఅప్ప‌ట్లో ఎన్టీఆర్‌కు సాధ్య‌మైన రికార్డ్ ఇప్పుడు బాల‌య్య‌కు మాత్ర‌మే సాధ్య‌మైందా ?

అప్ప‌ట్లో ఎన్టీఆర్‌కు సాధ్య‌మైన రికార్డ్ ఇప్పుడు బాల‌య్య‌కు మాత్ర‌మే సాధ్య‌మైందా ?

సినిమా రంగానికి చెందిన స్టార్ హీరోలు రికార్డులు క్రియేట్ చేయడం… ఆ రికార్డులను ఇత‌ర‌ హీరోలు తిరగరాయడం మామూలే. ఐదారు దశాబ్దాల తెలుగు సినీ చరిత్రలో ఎంతో మంది స్టార్ హీరోలు ఎన్నో రికార్డులను తిరగరాశారు. ఎప్పటికప్పుడు రికార్డులు మారుతూ ఉంటాయి. అయితే కొన్ని రికార్డులు మాత్రం ఎప్పటికీ కొందరు హీరోల పేరుమీద మాత్రమే ఉంటాయి. ఆ రికార్డులను ఎంతమంది హీరోలు వచ్చినా టచ్ చేసే ఛాన్స్ కూడా ఉండదు.

టాలీవుడ్ లో నందమూరి వంశానికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలిసిందే. ఈ వంశం నుంచి ఇప్పటికే మూడో తరం హీరోలు కూడా సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ‌ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అసలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎంత హిట్ టాక్ వచ్చిన సినిమా రెండో వారంలో థియేటర్లలో నిలబడే పరిస్థితి లేదు. అలాంటిది బాలయ్య అఖండ‌ 103 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇది మామూలు విషయం కాదని చెప్పాలి.

ఇదిలాఉంటే అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ నటించిన లవకుశ సినిమా ఏకంగా స్వర్ణోత్సవాలు జరుపుకోవడంతో పాటు ఎన్నో చెదిరిపోని రికార్డులు క్రియేట్ చేసింది. తెలుగులో తొలి డ‌బుల్ సెంచ‌రీ సినిమాగా ఎన్టీఆర్ నటించిన పాతాళభైరవి రికార్డులకు ఎక్కింది. ఆ తర్వాత లవకుశ థియేటర్లలో ఏకంగా 60 వారాలపాటు ఆడిన సినిమాగా నిలిచింది. ఇక లవకుశ అప్పట్లోనే సెకండ్ రిలీజ్‌లతో కలుపుకొని 62 కేంద్రాల్లో సెంచరీ కొట్టింది.

ఇక బాలయ్య నటించిన లెజెండ్ సినిమా కర్నూల్ జిల్లాలోని ఒక థియేటర్ లో 1005 రోజులు ప్రదర్శితమై తిరుగులేని రికార్డు సొంతం చేసుకుంది. సౌత్ ఇండియాలోనే ఇదే బిగ్గెస్ట్ రికార్డ్‌. అప్పటి తరంలో ఎన్టీఆర్ పేరిట ఎన్నో తిరుగులేని రికార్డులు ఉంటే… ఇప్పటి తరంలో ఆయన తనయుడు బాలయ్య చెక్కుచెదరని రికార్డులు లిఖించుకున్నాడు. రికార్డుల్లో తండ్రికి తగ్గ తనయుడిగా బాలయ్య త‌న పేరు సార్థ‌కం చేసుకున్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news