టాలీవుడ్ లో ఇప్పుడు యూత్ ఐకాన్ గా మారాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు తర్వాత అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో స్టార్ హీరోగా దూసుకు పోతున్నాడు. టాలీవుడ్ లో ఇప్పుడు యూత్ హీరోగా విజయ్ దేవరకొండ ఎంతో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆయన నటించిన పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం లాంటి సినిమాలతో యూత్ హీరోగా మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ.
ఇక ప్రస్తుతం పూరీ జగన్నధ్ డైరెక్షన్ లో లైగర్ అనే సినిమా చేస్తున్నాడు ఈ రౌడీ హీరో. ఇక ఈయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో ఉన్న పలువురు బడా స్టార్స్ కి కూడా ఈయన ఈఅక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఇదే విషయాని వాళ్ళు చాలా సంధర్భాలల్లో చెప్పుకొచ్చారు. ఇక విజయ దేవరకొండ కి తాను పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొచ్చింది స్టార్ సింగర్ హేమచంద్ర సతీమణి, గాయని శ్రావణ భార్గవి.
ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, యాంకర్ గా మలిటీ టాలెంటెడ్ వుమెన్ గా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. టాలీవుడ్ స్టార్ సింగర్ హేమచంద్రను ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రావణ భార్గవి..తన భర్తతో కలిసి పలు టీవీ షోలకు యాంకర్‌గా వ్యవహరించారు.
అంతేకాదు, ఆమె రెండు మూడు పాటలు కూడా రాశారు. రమణ గోగుల నిర్మించిన ‘బోణీ’ చిత్రంతో ప్లేబ్యాక్ సింగర్‌గా శ్రావణ భార్గవి కెరీర్ మొదలైంది. అయితే, ‘సింహా’లోని ‘సింహమంటీ చిన్నోడే వేటకొచ్చాడే’ పాట శ్రావణ భార్గవికి మంచి పేరు తీసుకొచ్చింది. ఇక ఆ తరువాత వరుసగా పాటలు పాడుతూ డబ్బింగ్ చెబుతూ తనదైన స్టైల్లో ఆకటుకుంది భార్గవి.
ఆ మధ్య ఓ లైవ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనగురించిన చాలా విషయాలు అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే నెటిజన్స్ ఒకవేళ మీకు హీరోయిన్ గా ఛాన్స్ వస్తే..హీరోగా ఎవరిని సెలక్ట్ చేసుకుంటారు. ఇందులో మీ భర్త పేరు మాత్రం చెప్పకూడదు అంటూ కండీషన్ పెట్టారు. దీనికి రిప్లై ఇస్తూ చంద్య్ పేరు చెప్పను..వ్జయ్ దేవరకొండ అని చెప్తాను. నాకు విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టం. అలాగే హీరోయిన్స్ లో సాయి పల్లవి అంటే చాలా ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది.