ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతుల్లో నిత్యావసర వస్తువుగా మారిపోయింది. అదిలేకుండా బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి నేడు ఎక్కడ చూసినా కనిపిస్తోంది. స్మార్ట్ఫోన్ల్ వినియోగం ఏ రీతిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్న పెద్దా తేడా లేదు.. ప్రతి ఒక్కరిలో చేతిలో స్మార్ట్ఫోన్ దర్శనమిస్తోంది. కొందరు స్టైల్ కోసం, మరికొందరు అవసరం కోసం, కారణమేదైనా సరే.. ఫోన్ మాత్రం తప్పనిసరి అయింది. దూర ప్రాంతాల్లో నివసించే బంధువులు, స్నేహితుల క్షేమ సమాచారం, అత్యవసర పనుల కోసం అందుబాటులోకి వచ్చిన సెల్ఫోన్లను చాలామంది అవసరం లేని పనులకు వినియోగించుకుంటూ తమ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. ఇళ్లలోని చిన్నారులెవరైనా గుక్కపట్టి ఏడుస్తుంటే పెద్దలు వారికి స్మార్ట్ఫోన్లో వీడియోలు పెట్టి సముదాయిస్తున్నారు. అంతలా సెల్ఫోన్ ప్రస్తుతం అందరినీ కట్టుబానిసలుగా మార్చుతోంది.
ఇక సోషల్ మీడియా సంగతి చెప్పక్కర్లేదు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్.. ఇలా.. అందరూ సోషల్ మీడియా అకౌంట్లు కలిగి ఉన్నారు.ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి దానికొచ్చే లైకులు, కామెంట్లు చూసి మురిసిపోయే వారు చాలామంది ఉన్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియా వేదికగా మోసాలు పెరిగిపోయాయి. ఇక ఇలాగే ఓ స్టార్ యాంకర్ ని మొసం చేసారు కొందరు కేటుగాళ్ళు. ఈవెంట్ పేరుతో ఆ యాంకర్ బట్టలు మార్చుకుంటున్న టైంలో వీడియోలు తీసారు.
అయితే తాజాగా ఓ యాంకర్ ని సోషల్ మీడియాలో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు సంప్రదించి తెలిసిన వాళ్ల ద్వారా ఆమె ఫోన్ నెంబర్ సంపాదించి.. ఈవెంట్ నిర్వహిస్తున్నామని మీరు యాంకరింగ్ చేయాలని డబ్బులు కూడా మీ రేంజ్ లోనే ఇస్తామని చెప్పి ఆ ఈవెంట్లో యాంకరింగ్ నిర్వహించాలని కొరారు. దీంతో యాంకర్ ఆ ఈవెంట్ చేయడానికి ఓకే చెప్పింది. మీరు రెడీ అయ్యి రండీ అంటూ ఓ స్టార్ హొటల్ లో రూం బుక్ చేసారు. ఆ యాంకర్ కూడా ఈవెంట్ కోసమని రెడీ అయ్యి వాళ్లకు కాల్ చేస్తున్న క్రమ్మలో ఆమెకు ఓ వీడియో వచ్చింది.
ఆమె ఆ వీడియో ఓపెన్ చేసి చూడగా అందులో ఆమె స్నానం చేస్తున్న క్లిప్స్..బట్టలు మార్చుకుంటున్న క్లిప్స్ కనిపించాయి. వెంటనే పరిస్ధితి అర్ధం చేసుకున్న సదరు యాంకర పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు ఆ కేటుగాళ్లను పట్టుకోలేకపోయారు. వాళ్ళు పక్క ప్లానింగ్ తో దొరకుండా తప్పించుకున్నారు. ఇక కొద్ది టైం తరువాత సోషల్ మీడియాలో తన నగ్న ఫోటోలు మరియు వీడియో చూసి ఒక్కసారిగా యాంకర్ షాకైంది. పోలీసులు వాళ్లను పట్టుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది.