రెండు దశాబ్దాల క్రితం వచ్చిన నువ్వేకావాలి సినిమా ఇండస్ట్రీ హిట్. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్‌పై రామోజీరావు నిర్మించిన ఈ సినిమాకు కె. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. ఆ రోజుల్లోనే కోటి రూపాయలతో తెరకెక్కిన ఈ సినిమా రు. 20 కోట్ల షేర్ రాబట్టింది. ఈ సినిమా తర్వాత తరుణ్ ఒక్కసారిగా యూత్‌లో క్రేజీ హీరోగా మారిపోయాడు. నువ్వేకావాలి తర్వాత ప్రియమైన నీకు, చిరుజల్లు లాంటి క్రేజీ ప్రాజెక్టుల్లో ఆపర్లు వచ్చాయి. చివరకు త్రివిక్రమ్ నువ్వే నువ్వే సినిమాలో కూడా హీరోగా నటించి సక్సెస్ కొట్టాడు. ఈ సినిమాలో శ్రీయ హీరోయిన్‌గా నటించింది.
ఆ తర్వాత కథల ఎంపికలో చేసిన తప్పులతో అతడు ఫేడవుట్ అయిపోయాడు. ఇక నువ్వేకావాలి సినిమా కథ ముందుగా ఇద్దరు హీరోలు రిజెక్ట్ చేస్తే ఆ తర్వాత అది తరుణ్ దగ్గరకు వచ్చిందట. తరుణ్ పక్కన రీచా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో హీరో, హీరోయిన్లు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ముందుగా హీరోకు హీరోయిన్ మీద ప్రేమ పుడుతుంది.. అది ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతూ ఉంటాడు.
హీరోయిన్‌కు తన ప్రేమ గురించి చెపితే ఫ్రెండ్‌షిఫ్ పోతుందేమో అన్న ఆందోళనతో ఉంటాడు. చివరకు క్లైమాక్స్‌లో తన ప్రేమ గురించి చెప్పేస్తాడు. 2000లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో తెలుగునాట ఓ ఊపు ఊపేసింది. కొన్ని సెంటర్లలో సంవత్సరం పాటు ఆడింది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాకు అప్పట్లో రామోజీరావు కేవలం రు. 75 లక్షలు మాత్రమే ఖర్చు చేశారని అంటారు.
ఆయన తన సొంత డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మయూరీ ద్వారా రిలీజ్ చేస్తే అప్పట్లోనే రు. 20 కోట్ల షేర్ రాబట్టింది. అయితే ఈ సినిమా దర్శకుడు విజయ్ భాస్కర్ ఈ సినిమా కథను ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వినిపించారట. అయితే అప్పటికే తాను తొలిప్రేమ సినిమా చేసి ఉండడంతో పవన్ ఈ కథ రిజెక్ట్ చేశారట.
ఆ తర్వాత ఈ కథ అక్కినేని మనవడు సుమంత్ దగ్గరకు వెళ్లిందట. అప్పుడు సుమంత్ కూడా వరుసగా లవ్‌స్టోరీల్లో నటిస్తుండడంతో సుమంత్ కూడా నో చెప్పాడట. చివరకు అది తరుణ్ చేతికి రావడంతో పాటు తరుణ్ కెరీర్‌లోనే కాకుండా.. టాలీవుడ్ చరిత్రలోనే మెమరబుల్ హిట్‌గా నిలిచిపోయింది.