తెలుగు సినిమా చరిత్రలో సీనియర్ హీరోలు శోభన్‌బాబు – మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు కష్టపడి సినిమాల్లోకి వచ్చారు. ఈ ఇద్దరు హీరోలు కూడా ఎవరి అండదండలు లేకుండానే ఉన్నత శిఖరాలు అధిరోహించారు.
కృష్ణా జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలోని చిన్న నందిగామకు చెందిన శోభన్‌బాబు ఎవరి అండదండలు లేకుండానే మద్రాస్ వెళ్లి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తిరుగులేని హీరో అయ్యారు. ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్ హీరోగా ఆయన మారిపోయారు. పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు చెందిన కొణిదెల శివశంకర ప్రసాద్ మెగాస్టార్ చిరంజీవిగా ఎదిగారు.
ఈ రోజు తెలుగు సినిమా పరిశ్రమలో మెగా ఫ్యామిలీ నుంచి ఏకంగా 12 మంది హీరోలు ఉన్నారు అంటే అందుకు చిరంజీవి వేసిన బలమైన పునాది కారణం అని చెప్పాలి. శోభన్ బాబు అప్పటి తరంలో ఎన్టీఆర్ – ఏఎన్నార్ – కృష్ణ – కృష్ణంరాజు లాంటి హీరోలకు పోటీగా ఈ సినిమాల్లో నటించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి 1980వ దశకంలో అప్పటి సీనియర్ హీరోలకు భిన్నంగా… తాను అప్పటి ప్రేక్షకులను మత్తెక్కించే చేశారు. అయితే ఈ ఇద్దరు హీరోలు కలిసి ఒకే టైటిల్‌తో వచ్చిన సినిమాల్లో నటించారు.
1975 లో సమతా ఆర్ట్స్, యోగేంద్ర నిర్మాణంలో విక్టరీ మధుసూదనరావు దర్శకత్వంలో శోభన్ బాబు హీరోగా జేబుదొంగ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో శోభన్ బాబు – మంజుల హీరో, హీరోయిన్లుగా నటించారు. ముళ్ళపూడి వెంకటరమణ మాటలు అందించగా… చక్రవర్తి సంగీతం అందించారు. ఆ సంవత్సరం సోగ్గాడు లాంటి ఫ్యామిలీ కథాంశంతో వచ్చిన సినిమాతో హిట్ కొట్టిన శోభన్‌బాబు జేబుదొంగ లాంటి మాస్ సినిమాతో మరో హిట్ కొట్టాడు.
ఇక ప్రాణం ఖరీదు – పునాదిరాళ్ళు సినిమాలతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి 1987లో అర్జున్ రాజు – రామలింగ రాజు నిర్మాణంలో ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన జేబుదొంగ సినిమాలో నటించారు. ఈ సినిమాలో చిరంజీవి.. రాధ.. భానుప్రియ హీరో, హీరోయిన్లుగా నటించారు. గతంలో చిరంజీవి – శోభన్ బాబు కలిసి మోసగాడు సినిమాలో నటించారు. ఇక వీరిద్దరూ ఒకే టైటిల్‌తో చేసిన రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.