కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ చాలా సింపుల్‌గానే ఉంటాడు. వాస్తవానికి రజనీకాంత్‌కు అల్లుడు కాకముందు ధనుష్‌కు అంత పేరు కూడా లేదు. ఎప్పుడు అయితే రజనీ కుమార్తె ఐశ్వర్యను ప్రేమ వివాహం చేసుకున్నాడో ఆ తర్వాత మనోడి రేంజ్ మారిపోయింది. రజనీ అభిమానులు కూడా కొంత వరకు ధనుష్‌ను ఓన్ చేసుకున్నారు. మంచి సబ్జెక్ట్‌లు ఎంచుకుని సినిమాలు తీయడంతో పాటు ఇటు తెలుగులో తన సినిమాలు రిలీజ్ చేయడంతో ఇక్కడ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. అప్పుడప్పుడు బాలీవుడ్‌లోకి కూడా వెళుతున్నాడు. ఓవరాల్‌గా మంచి పేరు వచ్చింది.
ఇక 18 ఏళ్ల వైవాహిక జీవితం అంతా సాఫీగా సాగుతోంది అనుకుంటోన్న టైంలో ఇప్పుడు ధనుష్ – ఐశ్వర్య విడిపోవడం రజనీ అభిమానులు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు వీరిద్దరి దాంపత్య జీవితం ఇద్దరు హీరోయిన్ల వల్లే ఒడిదుడుకులకు లోనైందన్న టాక్ కోలీవుడ్‌లో బలంగా ఉంది. 2011లో ఐశ్వర్య తొలిసారిగా దర్శకత్వం వహించి భర్త ధనుష్ హీరోగా థ్రిల్లర్ సినిమా 3 తెరకెక్కించారు.
ఆ సినిమాలో తన బాల్య స్నేహితురాలు శృతీహాసన్‌ను తీసుకున్నారు. అప్పుడే ధనుష్ – శృతి మధ్య ఏదో ఉందనే ప్రచారం జరిగింది. అప్పుడే ధనుష్ – ఐశ్వర్య విడిపోతున్నట్టు ప్రచారం జరిగింది. ఆ తర్వాత అందా సర్దుకుంది. కలిసే ఉన్నారు. అయితే ఆ తర్వాత అమలాపాల్ ధనుష్ జీవితంలోకి ఎంట్రీ ఇచ్చాక వీరి జీవితంలో మరోసారి పొరాపొచ్చలు వచ్చాయంటున్నారు.
అమలాపాల్ – దర్శకుడు విజయ్ను ప్రేమ వివాహం చేసుకుంది. అయితే రెండేళ్లకే అతడికి విడాకులు ఇచ్చింది. అప్పుడు విజయ్ ఫ్యామిలీ అయితే కేవలం ధనుష్ వల్లే తమ కొడుకు జీవితం విచ్ఛిన్నమైందని ఆరోపణలు చేశారు. అమలాపాల్ – ధనుష్ మధ్య ఏదో ఉందనే ప్రచారం గట్టిగానే జరిగింది. విడాకుల తర్వాత అమల మళ్లీ పెళ్లి చేసుకోకుండా వరుసగా సినిమాలు చేస్తోంది.
ధనుష్ – అమలాపాల్ సాన్నిహిత్యంపై ఐశ్వర్యకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయని.. ఆమె సైతం ఈ విషయంలో రాజీపడకలేక పోయిందని అంటున్నారు. ఇప్పుడు ఆమె వల్లే ధనుష్, ఐశ్వర్యకు దూరం అయ్యారన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఏదేమైనా ఈ ఇద్దరు హీరోయిన్ల వల్లే ధనుష్ – ఐశ్వర్య జీవితం ఒడిదుడుకులకు లోనైందన్నది వాస్తవం.