అక్కినేని నాగార్జున, నాగచైతన్య హీరోలుగా నటించిన తాజా మూవీ బంగార్రాజు. ఎవ్వరు ఊహించని విధంగా సంక్రాంతి రేస్ లో నిలిచి..గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ అయ్యి..ఫైనల్ గా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడమే కాకుండా..బాక్స్ ఆఫిస్ దవ్వ కాసుల వర్షం కురిపిస్తుంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద జెట్ స్పీడ్ లో దూసుకెళ్తోంది. విడుదలైన మొదటి రోజే రికార్డు వసూళ్లు సాధించిన బంగార్రాజు సినిమా.. రెండో రోజు కూడా అదే దూకుడు చూపించింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రెండు రోజుల్లో రూ.36 కోట్లు వసూళ్లు చేసి న్నట్లు తెలుస్తుంది. దీంతో మరోసారి బాక్సాఫీస్‌పై అక్కినేని ఫ్యామిలీ సత్తా చూపించారు.
సినిమాల విషయంలో నాగార్జున క్యాలిక్యులేషన్స్ ఎప్పుడు తప్పవు అని మరోసారి ప్రూవ్ చేసాడు నాగ్. పండుగకు తప్పకుండా వస్తుందని..టికెట్ రేట్లు, కరోనా మహమ్మారి తన సినిమాపై ప్రభావం చూపించదని ముందు నుంచి నాగార్జున చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఫైనల్ గా అదే జరిగింది. కుటుంబం మొత్తం వెళ్లి కలిసి చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇది అని కూడా చెప్పారు . అలానే ఫ్యామిలీ అంత హ్యాపీగా కూర్చోని మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు జనాలు. సినిమా పై నాగార్జున కు అంత నమ్మకం ఉంది కనుకే అంత ధీమా గా చెప్పాడు. పండుగ వేళ..కరోనా మహమ్మారి కారణంతో బరిలోంచి పెద్ద సినిమాలన్నీ తప్పుకున్నాయి. పండుగ లాంటి సినిమా..పండుగకు మాత్రమే వచ్చే సినిమా అంటూ వచ్చేసిన బంగార్రాజు దూసుకుపోతోంది. సంక్రాంతి బరిలోంచి అన్ని సినిమాలు తప్పుకోవడంతో బంగార్రాజు సింగిల్‌గా నిలిచాడు.
రూ.40 కోట్ల లక్ష్యంతో బరిలోకి దిగిన ‘బంగార్రాజు’ మూవీకి ఏపీ, తెలంగాణలో భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 2.41 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.66 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 93 లక్షలు, ఈస్ట్‌లో రూ. 88 లక్షలు, వెస్ట్‌లో రూ. 49 లక్షలు, గుంటూరులో రూ. 61 లక్షలు, కృష్ణాలో రూ. 49 లక్షలు, నెల్లూరులో రూ. 32 లక్షలతో కలిపి రూ. 7.79 కోట్లు షేర్, రూ. 13 కోట్లు గ్రాస్ వచ్చింది.రెండు రోజులుగా రికార్డులు సృష్టిస్తోంది. రెండో రోజు నైజాంలో రూ.4.47 కోట్లు, సీడెడ్ రూ. 3.46 కోట్లు, ఉత్తరాంద్రలో రూ.2.20 కోట్లు రాబట్టింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మొత్తం రెండు రోజుల్లో కలిపి రూ. 36 కోట్లు రాబట్టింది. దీనికి సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ని కూడా విడుదల చేసింది.