టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలోని పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ కాశీబుగ్గ బస్టాండ్‌కు దగ్గరలో నివాసం ఉంటున్న సినీ నటుడు కొంచాడ శ్రీనివాస్ (47) అనారోగ్యంతో మృతిచెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న శ్రీను కాశీబుగ్గలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. శ్రీనివాస్ తన కెరీర్లో 40కు పైగా సినిమాలతో పాటు, 10కి పైగా టీవీ సీరియల్స్‌లో కూడా నటించారు. అటు వెండితెరతో పాటు ఇటు బుల్లితెరపై కూడా తన పాత్రల ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.
శ్రీను నటించిన సినిమాల్లో ఆది – శంకర్‌దాదా ఎంబీబీఎస్ – ప్రేమకావాలి – ఆ ఇంట్లో లాంటి సినిమాల్లో పాత్రలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక శ్రీను సినిమాలలో ఎంత బిజీగా ఉన్నా కూడా ప్రతి సంక్రాంతి పండుగకు ఇంటికి వచ్చి ఇక్కడే తల్లిదండ్రులతో కలిసి పండగ జరుపుకోవడానికి ఇష్టపడతాడు. ఇదిలా ఉంటే శ్రీను షూటింగ్ సమయంలో పడిపోయాడు.
అప్పుడు ఛాతీపై దెబ్బ తగిలిందని చెపుతున్నారు. ఆ తర్వాత అతడికి గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని తేలింది. ఆ కారణంతోనే మృతి చెంది ఉంటాడని కుటుంబ సభ్యులు చెపుతున్నారు. శ్రీనివాస్‌కు అమ్మ విజయలక్ష్మి ఉన్నారు. శ్రీనివాస్ సోదరుడు గతంలోనే మృతి చెందగా.. ఇద్దరు అక్కాచెల్లెళ్లు అత్తారిళ్లలో ఉన్నారు. శ్రీను మరణంతో స్థానికంగా పలాస – కాశీబుగ్గలో విషాద చాయలు అలముకున్నాయి.