ఇదో హీరోయిన్ ముద్దు కథ.. కాస్త చిత్ర విచిత్రంగానే ఉంటుంది. ఎప్పుడో 15 ఏళ్ల క్రిందట దేశవ్యాప్తంగా పెద్ద రచ్చ రచ్చకు కారణమైంది. ఓ వేదిక మీద హాలీవుడ్ నటుడు రిచర్డ్ గెరే బాలీవుడ్‌లో అప్పటి క్రేజీ హీరోయిన్ శిల్పాషెట్టిని కాస్త గట్టిగా హత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఆ ముద్దుకు సంబంధించి ఏదో ఒక పిటిషన్ వేయడంతో దానిపై తీర్పు ఇవ్వడానికి మన కోర్టులకు ఏకంగా 15 ఏళ్లు పట్టింది. ఈ ముద్దు మీదే పని కట్టుకుని రోజువారి విచారణ చేయకపోయినా ఈ 15 ఏళ్లలో ఈ ముద్దు చాలా సార్లు కోర్టుల్లో చర్చకు వచ్చింది.
ఈ ముద్దు కేసులో శిల్సా షెట్టి నిందితురాలు కాదు.. కానీ ఆమె బాధితురాలు అయ్యింది. తాజాగా ముంబై కోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పటి తరం యూత్‌లో చాలా మందికి ఈ ముద్దు కథ తెలియకపోవచ్చు. పదిహేనేళ్ల క్రితం మన దేశంలో ఎయిడర్స్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లో ఓ కార్యక్రమం జరిగింది. దేశవ్యాప్తంగా రిచర్డ్ గెరే కార్యక్రమాలకు టాలీవుడ్ నటులు కూడా హాజరయ్యారు. రాజస్తాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వేదిక మీదే నటి శిల్పాషెట్టిని గెరే గట్టిగా హత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు.
శిల్ప ఆ చర్యతో ఇబ్బంది పడ్డా చేసేదేమి లేక అతడు గట్టిగా వాటేసుకోవడంతో ఇబ్బందితోనే ఓ నువ్వు నవ్వింది. ఆ చర్య ఆమె ఊహించలేదు. అయితే శిల్పా ఏమీ అతడికి ముద్దు ఇవ్వలేదు. అయితే గెరే ముద్దు ఉత్సహాం, మురిపెంతో పెట్టిందే. అయితే కొందరు జనాలు చిర్రెత్తిపోయారు. ఇది మన దేశ సంస్కృతికే అవమానం అని.. రిచర్డ్ మీదే కాదు, శిల్ప మీద కూడా కేసులు పెట్టేశారు.
ఈ కేసులో గెరే ముద్దు పెడితే శిల్పా బాధితురాలు.. కానీ ఆమె కూడా కేసులో నానింది. ఇక న్యాయస్థానం తాజాగా దీనిపై స్పందిస్తూ ఈ కేసులో ఆమెను నిందితురాలిగా చూడలేమని.. బాధితురాలిగానే చూడాలని తీర్పు చెప్పింది. దీంతో 15 ఏళ్లుగా సాగిన ఈ ముద్దు కథలో కేసు పెట్టిన వారికి చెంపచెల్లుమనే ఆన్సర్ కోర్టు నుంచి వచ్చింది.