ఇప్పటి వరకు ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రలో అతి పెద్ద ప్లాప్ సినిమాలుగా షారుక్‌ఖాన్ జీరో, రణబీర్‌కపూర్ బాంబేవెల్వెట్ వంటి సినిమాలు ఉండేవి. తక్కువలో తక్కువ రు. 80 కోట్ల నష్టాలతో ఈ సినిమాలు డిజాస్టర్‌గా నిలిచాయి. ఈ సినిమాలు ఇండియన్ సినిమా చరిత్రలోనే పెద్ద ప్లాప్ సినిమాలుగా ఇప్పటి వరకు నిలిచాయి. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాల రికార్డులను మరో సినిమా బద్దలు కొట్టి.. కొత్త బిగ్గెస్ట్ ప్లాప్ సినిమాగా నిలిచింది.
ఈ సినిమా కనీసంగా రు. 80 కోట్ల పై చిలుకు నష్టాలతో బయట పడుతుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఈ బాలీవుడ్ సినిమా రు. 260 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ సినిమాకు దేశవ్యాప్తంగా, అటు అంతర్జాతీయ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు చూసినా కూడా రు. 80 కోట్ల కంటే ఎక్కువ నష్టాలు తప్పవని తెలుస్తోంది.
ఇండియన్ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ ప్లాప్‌గా ఈ సినిమా నిలుస్తుందని అంటున్నారు. విచిత్రం ఏంటంటే భారతదేశ క్రికెట్ చరిత్రలోనే 1983 ప్రపంచకప్ గెలుచుకోవడం బెస్ట్ మూమెంట్. అలాంటి బెస్ట్ మూమెంట్‌పై తెరకెక్కిన ఈ సినిమా ఇంత డిజాస్టర్ అవ్వడం నిరుత్సాహ పరిచే అంశం. భారీ కాస్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రు. 260 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది.
పాజిటివ్ టాక్ వచ్చినా, క్రిటిక్స్ మెచ్చుకున్నా కూడా సినిమా కమర్షియల్‌గా నిలబడలేకపోయింది. ఇక ఈ సినిమా ఇంత ప్లాప్ కావడం వెనక కోవిడ్ కూడా ఓ కారణం అని అంటున్నారు. ఒమిక్రాన్ దెబ్బతో నార్త్‌లో థియేటర్లపై ఆంక్షలు, 50 శాతం సిటింగ్ కెపాసిటీ, మహారాష్ట్రలో సెకండ్ షోలు క్యాన్సిల్.. ఇలా చాలా కారణాలు ఈ సినిమా వసూళ్లపై ప్రభావం చూపాయి.